Big Stories

Raman Subba Row Died: మాజీ క్రికెటర్ రామన్ ఇక లేరు.. సొంతూరు ఏపీలోని..

England Ex Cricketer Raman Subba Row Passed Away: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఐసీపీ మ్యాచ్ రిఫరీ రామన్ సుబ్బారో మరణించారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. 1958 -1961 మధ్య ఇంగ్లాండ్ జట్టు తరపున 13 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. అందులో మూడు సెంచరీలు కూడా చేశారు. ఆటగాడిగా రిటైర్మెంట్ తర్వాత టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డుకు తన సలహాలు అందించారు. క్రికెట్‌లో పబ్లిక్ రిలేషన్స్ కంపెనీని ప్రారంభించారు కూడా.

- Advertisement -

ఇంగ్లాండ్‌లోని ఫ్ట్రీథమ్‌ ప్రాంతంలో జన్మించిన సుబ్బారో 1953లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టూవర్ట్ సర్రిడ్జ్ నేతృత్వంలో జట్టు కోసం ఆడాడు. ఆ జట్టు వరుసగా ఏడు కౌంటీ ఛాంపియన్ షిప్‌లను గెలుచు కుంది. పదేళ్లపాటు సుబ్బారో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ ఆడారు. 260 మ్యాచ్‌లు ఆడిన ఆయన, దాదాపు 14000 పైగా పరుగులు సాధించారు. లెగ్ స్పిన్‌తో 87 వికెట్లు తీశారు. 1991లో క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు అతనికి ఈబీసీ అవార్డు లభించింది. అలాగే 1992 – 2001 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 41 టెస్టులు, 119 వన్డేలను ఆయన పర్యవేక్షించారు.

- Advertisement -
England Ex Cricketer, ICC match referee Raman Subba Row Dies
England Ex Cricketer, ICC match referee Raman Subba Row Dies

Also Read: LSG Vs CSK IPL 2024 Preview: ధోనీ సేన ముందడుగు వేసేనా? నేడు లక్నో వర్సెస్ చెన్నయ్ మధ్య పోరు

ఇంకా హిస్టరీలోకి వెళ్తే..

రామన్ సుబ్బా రో ఫాదర్ తెలుగు వ్యక్తి. ఆయన పేరు వెంకట సుబ్బారావు. ఏపీలోని బాపట్ల సొంతూరు. ఉన్నత చదువుల కోసం సుబ్బారావు లండన్‌కు వెళ్లారు. అక్కడ బ్రిటన్ మహిళ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి చివరకు పెళ్లి చేసుకున్నారు. వీరి సంతానమే రామన్ సుబ్బారో.

రామన్ సుబ్బారో మరణవార్త విని పలువురు క్రికెటర్లు, ఐసీసీ రిఫరీలు తమ సంతాపం తెలిపారు. సుబ్బారో క్రికెట్ మనిషి అని గుర్తు చేసుకున్నారు. ఆటగాడిగా, అధికారిగా, నిర్వాహకుడిగా ఆయన తన బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. రామన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News