BigTV English

Realme 13 And 13+ 5G: దుమ్ముదులిపే స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మొదటి సేల్ షురూ, ఆఫర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Realme 13 And 13+ 5G: దుమ్ముదులిపే స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మొదటి సేల్ షురూ, ఆఫర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Realme 13, Realme 13+ 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ Realme నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Realme 13 సిరీస్ అధికారికంగా ఈరోజు అంటే సెప్టెంబర్ 6న భారతదేశం అంతటా ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో Realme 13, Realme 13+ 5G వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ సిరీస్‌ను Flipkart, realme అధికారిక వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లోని మోడల్‌కు సంబంధించిన ధర, ఆఫర్‌లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇతర వివరాలను తెలుసుకుందాం.


Price And Offers

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వీటి సేల్ మొదలైంది. మొదటి సేల్‌లో పలు బంపరాఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా Realme 13+ 5G ఫోన్ విషయానికొస్తే.. ఇది మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా నిర్ణయించబడింది. అలాగే మిడ్ రేంజ్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999కి అందుబాటులో ఉంది. ఇక దీని టాప్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. వీటిపై భారీ బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే అన్ని బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులపై రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే కేవలం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ రూ.1500 తగ్గింపుతో ఈ మూడు మోడళ్ల ధరలు మరింత తగ్గుతాయి.


ఇక Realme 13 5G ధర విషయానికొస్తే.. దీని మరింత చౌకనదిగా ఉంది. ఇందులో రెండు వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.17,999కి ఉండగా.. రూ.1000 తగ్గింపుతో రూ.16,999 లభిస్తుంది. అదే సమయంలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అదే రూ.1,000 క్యాష్‌బ్యాక్‌తో రూ.18,999కి అందుబాటులో ఉంటుంది.

Also Read: కుమ్ముడే కుమ్ముడు.. ఏకదాటిగా దూసుకుపోతున్న వివో.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్!

Realme 13+ 5G Specifications

Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7300 చిప్‌సెట్ అమర్చబడింది. ఇది రోజువారీ పనులు, డిమాండ్ ఉన్న అప్లికేషన్‌లు రెండింటికీ పటిష్టమైన పనితీరును అందిస్తుంది. 26GB వరకు డైనమిక్ ర్యామ్‌తో (వర్చువల్ ర్యామ్‌తో సహా), వినియోగదారులు స్మూత్‌ అయిన మల్టీ టాస్కింగ్‌ను ఆశించవచ్చు. గేమర్‌ల కోసం ‘GT మోడ్’ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్లూయిడ్ అనుభవం కోసం గేమ్‌లు 90 FPS వరకు రన్ అయ్యేలా చేస్తుంది. ఫోన్ 80W అల్ట్రా ఛార్జ్ టెక్నాలజీ వేగవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తుంది. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో ఒక గంట గేమింగ్ సమయాన్ని అందిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా అధిక-నాణ్యత ఫోటోలను అందిస్తుంది. అలాగే ఫోన్ 7.6mm అల్ట్రా-స్లిమ్ డిజైన్ సొగసైన, సౌకర్యవంతమైన పట్టును అందిస్తుంది.

Realme 13 5G Specifications

Realme 13 5G స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. ‘GT మోడ్’ యాక్టివేట్ చేయడంతో, వినియోగదారులు చాలా గేమింగ్ టైటిల్స్‌లో స్థిరమైన 60 FPSని ఆస్వాదించవచ్చు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. దాని 120Hz డిస్ప్లే గేమింగ్, మీడియా కోసం వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. 50MP OIS కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అందువల్ల తక్కువ ధరలో అధిక ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలి అని అనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×