BigTV English

Selfy craze death: సెల్ఫీ మోజులో పడి పాముతో చెలగాటం..యువకుడు మృతి

Selfy craze death: సెల్ఫీ మోజులో పడి పాముతో చెలగాటం..యువకుడు మృతి

Kamareddy district Young boy playing with poison snake: సోషల్ మీడియాలో సెల్ఫీల మోజు బాగా క్రేజ్ గా మారిపోయింది. వినోదాత్మకంగా మొదలైన సెల్ఫీ వీడియోలు నేడు విషాదాత్మకంగా మారుతున్నాయి. ప్రమాదం అని తెలిసినా సెల్పీల ప్రపంచంలో మునిగి తేలుతుప్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేవలం లైకులతోనే డబ్బులు రావు..లైకులు ఏమైనా కిక్క్ ఇస్తాయేమో గానీ దాని వెనక ఉన్న రిస్క్ చూడటం లేదు. రైల్లో, బస్సుల్లో, బైకుపై వేగంగా వెళుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొందరు స్నేహితులు బాగా రెచ్చగొట్టి నువ్వు మాత్రమే ఆ పని చేయగలవని ప్రోత్సహిస్తూ వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు. తాజాగా ఓ విష సర్పం వీడియోను సెల్ఫీగా తీసుకోవాలని భావించాడో యువకుడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయి పేట గ్రామంలో గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం కామారెడ్డి జిల్లా పరిధిలో పోచారం కాలనీలో పేదవారు నివసించే డబుల్ బెడ్ రూమ్ కాలనీ సముదాయంలో నివాసం ఉంటున్నాడు మోచి శివరాజ్ అతని వయసు ఇరవై సంవత్సరాలు. నిత్యం పాములు పట్టుకుని తన జీవనం సాగిస్తుంటాడు.


పాములు పట్టడమే జీవనోపాధి

చదువు లేకపోవడంతో దానినే జీవనోపాధిగా మలుచకున్నాడు. అయితే గురువారం ఉదయం తనకు దొరికిన రెండు మీటర్ల పొడవైన అత్యంత విషం కలిగిన తాచుపామును పట్లుకున్నాడు. దానిని గిరగిరా తిప్పుతూ ఎదుటి వారికి వినోదాన్ని పంచాడు. అందరూ అతని ధైర్యాన్ని చూసి మెచ్చుకోవడంతో మరో అడుగు ముందుకేశాడు. సెల్ఫీ వీడియో కోసం పాము తలను నోట్లో పెట్టుకున్నాడు. అయితే ఆ పాము కోపంగా నోట్లోనే విషం చిమ్మింది. అక్కడికక్కడే ఆసుపత్రికి తరలించేలోగా శివరాజ్ మృత్యువు పాలయ్యారు. తరతరాలుగా పాములు పట్టుకుని జీవనం సాగిస్తారు వారి కుటుంబం. శివరాజ్ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందరూ శివరాజ్ పరిస్థితికి జాలి పడుతుండగా..కొందరు మాత్రం అతనికి తగిన శాస్తి జరిగిందని..భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలా విష సర్పాలతో ఆడుకోరని కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×