BigTV English

Realme C61 Launching: రూ.10,000 కంటే తక్కువ ధరలోనే రియల్ మి కొత్త ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్!

Realme C61 Launching: రూ.10,000 కంటే తక్కువ ధరలోనే రియల్ మి కొత్త ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్!

Realme C61 Launching on June 28th: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్ మి నుంచి ఇటీవలే జిటి6 ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు మరొక కొత్త ఫోన్‌ను రియల్ మీ త్వరలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఆ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా బయటకొచ్చాయి. ఈ వివరాల ప్రకారం.. రియల్ నుంచి జూన్ 28న రియల్ మి సి61 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.


దీంతోపాటు ఈ ఫోన్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌‌గా ఐపీ54 రేటింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే డిజైన్ పరంగా కూడా ఇది ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు. ఇక దీని అంచనా స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 1600-720 పిక్సల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఎయిర్ గెశ్చర్, మినీ క్యాప్సుల్ 2.0 నాచ్, డైనమిక్ బటన్, రెయిన్ స్మార్ట్ టచ్ టెక్నాలజీతో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఓఎస్‌పై రన్ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45వాట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది 50మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తుంది.


Also Read: మరొక కొత్త కలర్‌లో రెడ్‌మీ ఫోన్.. అబ్బా ఏముంది బాసూ..!

ఇది 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్.. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. అవి గ్రీన్, బ్లాక్ కలర్‌లో ఉండనున్నట్లు సమాచారం. అయితే వీటి ధరపై మాత్రం ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ అంచనా ప్రకారం.. ఈ ఫోన్ కేవలం రూ.10000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Tags

Related News

Infinix Hot 60i vs Tecno Spark Go: ₹10,000 లోపు ధరలో కొత్త 5G ఫోన్లు.. ఏది బెటర్?

Galaxy S24 Ultra Alternatives: గెలాక్సీ S24 అల్ట్రాకు పోటీనిచ్చే ప్రీమియం ఫోన్లు.. తక్కువ ధర, అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌కు చెక్

Vivo G3 5G Launch: వివో G3 5G విడుదల.. ₹20,000 లోపు ధరలో 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే

WhatsApp Scam: వాట్సాప్ నయా స్కామ్, షేర్ చేశారో అకౌంట్ ఖాళీ అవ్వడం పక్కా!

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Big Stories

×