BigTV English

Realme Pad 2: కొత్త టాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్ మీ.. ధర, ఫీచర్లు ఇవే!

Realme Pad 2: కొత్త టాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్ మీ.. ధర, ఫీచర్లు ఇవే!

Realme Pad 2 Price and Features: రియల్ మీ దేశంలోని ఫేమస్ టెక్ కంపెనీల్లో ఒకటి ఉంది. ఈ కంపెనీ ఇటీవల కాలంలో వరుసగా గ్యాడ్జెట్‌లు మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. తాజాగా రియల్ మీ తన బ్రాండ్ నుంచి కొత్త టాబ్లెట్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ పాడ్ 2ను కంపెనీ గతేడాది జూలైలో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీని అప్‌గ్రేడ్ వెర్షన్‌ను Wi-Fi వేరియంట్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Realme Pad 2 Wi-Fi వేరియంట్ పాత LTE వేరియంట్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ టాబ్లెట్ గ్రే మరియు గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. కంపెనీ ఈ Realme టాబ్లెట్‌ను ఏప్రిల్ 15న విడుదల చేయబోతోంది. అదే రోజున Realme తన కొత్త P సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా లాంచ్ చేయనుంది. ఈ కొత్త సిరీస్ కింద, కంపెనీ Realme P1,  Realme P1 Proలను లాంచ్ చేస్తుంది. ఇదే ఈవెంట్‌లో కంపెనీ Realme Pad 2  Wi-Fi వేరియంట్‌ను కూడా లాంచ్ చేస్తుంది.

Also Read : 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్!


ఈ టాబ్లెట్  LTE వేరియంట్ రూ. 19,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది. దీనిలో  6GB RAM+ 128GB స్టోరేజ్‌‌తో లభిస్తుంది. ఈ ట్యాబ్  రెండవ వేరియంట్ 8GB RAM+256GB స్టోరేజ్‌తో వస్తోంది.  దీని ధర రూ. 22,999గా ఉంది. కాబట్టి కంపెనీ తన వైఫై వేరియంట్ టాబ్లెట్ ధరను LTE వేరియంట్ కంటే తక్కువగా ఉంచే అవకాశం ఉంది.

ఈ ట్యాబ్ 11.52 అంగుళాల TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.  ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ట్యాబ్‌లోని ప్రాసెసర్ కోసం MediaTek Helio G99 SoC చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది గ్రాఫిక్స్ కోసం Mali G57 GPUతో వస్తుంది. ట్యాబ్ వెనుక భాగంలో 8MP కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇక పవర్ విషయానికి వస్తే ఇందులో 8,360mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇందులో క్వాడ్-స్పీకర్ సెటప్, డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్, టైప్-సి హెడ్‌ఫోన్ పోర్ట్ ఉన్నాయి. ఇది 6GB/8GB LPDDR4X RAMని కలిగి ఉంది. 8GB వరకు డైనమిక్ RAM మద్దతుతో వస్తుంది.

Also Read : శ్యామ్‌సంగ్ నుంచి సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

స్టోరేజ్ కోసం 128GB/256GB UFS 2.2 కలిగి ఉంది. ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్‌ కూడా ఉంటుంది. ఈ టాబ్లెట్ Android 13 ఆధారంగా Realme UI 4.0పై రన్ అవుతుంది. టాబ్లెట్ బరువు 518 గ్రాములు.  కంపెనీ బ్లూటూత్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా ఇందులో అందించింది.

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×