Redmi Turbo 4 : బడ్జెట్స్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను ఎప్పటికప్పుడు మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ redmi. ఇప్పటికే ఎన్నో మిడ్ రేండ్ మొబైల్స్ ను అదిరిపోయే ఫీచర్స్ తో తీసుకొచ్చేసిన రెడ్ మీ.. తాజాగా మరో కొత్త మొబైల్ ను తీసుకురాబోతుంది. అయితే తాజాగా ఈ మెుబైల్ ఫీచర్స్ గీక్‌బెంచ్‌లో కనిపించాయి. దీంతో ప్రాసెసర్ మోడల్ లీక్ అయ్యింది. ఇక ఈ మెుబైల్ ఫీచర్స్, ప్రాసెసర్, స్టోరేజ్ వివరాలివే.
చైనాకు చెందిన టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ redmi ఇప్పటికే ఎన్నో మొబైల్స్ ను అందుబాటు ధరల్లోనే లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రెడ్ మీ టర్బో 4 మొబైల్ ను తీసుకురాబోతుంది. ఈ మొబైల్ MediaTek డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటినుంచో ఈ మొబైల్ ఫీచర్స్ లీక్ అవుతూనే వస్తున్నాయి. వచ్చే ఏడాది మొదటి భాగంలో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మొదటగా ఈ మొబైల్ చైనా మార్కెట్లో లాంఛ్ కాబోతుందని.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.
Redmi Turbo 4 స్పెసిఫికేషన్స్ –
గీక్‌బెంచ్ లో తాజాగా పేరులేని ఓ కొత్త రెడ్ మీ మెుబైల్ లిస్ట్ అయ్యింది. ఈ మెుబైల్ మోడల్ నంబర్ 24129RT7CCగా ఉంది. అయితే ఈ మెుబైల్ Redmi Turbo 4 ప్రోటోటైప్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ గ్యాడ్జెట్ సింగిల్ కోర్ టెస్ట్ లో దాదాపు 1649 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో దాదాపు 6342 పాయింట్లు స్కోర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మోడల్ RAM 14.96 GB. లాంఛ్ టైమ్ లో 16GB RAMను చూసే ఛాన్స్ ఉంటుంది.
అంతే కాకుండా, Redmi Turbo 4 Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పని చేస్తుందని కూడా తెలుస్తుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్‌కు రోడిన్ అనే కోడ్‌నేమ్ ఎటాచ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిప్‌సెట్ 4+3+1 ఆర్కిటెక్చర్, 3.25 GHz క్లాక్ స్పీడ్‌ను కలిగి ఉంది. ఇక ఈ కాన్ఫిగరేషన్‌లు MediaTek డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌తో సమానంగా ఉంటాయి.
ఇక తాజాగా తీసుకొవచ్చిన మీడియా టెక్ డైమెన్ సిటీ 8400 ప్రాసెసర్ టర్బో 4 మొబైల్స్ లో రాబోతుందని.. రెడ్మీ మొబైల్స్ లో మొదటిసారి ఈ ప్రాసెసర్ వస్తున్నట్టు ఈ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. అయితే ఏప్రిల్ 2024లో ఎంతో గ్రాండ్ గా లాంఛ్ అయిన రెడ్ మీ టర్బో 3 మెుబైల్.. గ్లోబల్ మార్కెట్‌లో Poco X6 ప్రో గా రీ బ్రాండ్ చేయబడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గ్లోబల్ మార్కెట్‌లో రెడ్‌మి టర్బో 4ను పోకో X7 ప్రోగా వచ్చే ఛాన్స్ ఉంటుదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన మిగిలిన ఫీచర్స్ ఇప్పటి వరకూ తెలియలేదు. అయితే త్వరలోనే రెడ్ మీ ఇందుకు సంబంధించిన మిగిలిన ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్, ధర, కెమెరా, డిస్ ప్లే ఫీచర్స్ ను వెల్లడించే ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : సామ్సాంగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. గెలక్సీ S25తో వచ్చేస్తున్న మరో స్మార్ట్ గ్యాడ్జెట్