Samsung Galaxy Ring 2 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ ఎప్పటికప్పుడు తన కష్టమర్స్ కోసం లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదిరిపోయే ఫీచర్స్ తో 2025 జనవరిలో సామ్సాంగ్ గెలక్సీ S25 సిరీస్ (Galaxy S25 series) ను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో అదిరిపోయే మూడు మొబైల్స్ రాబోతున్నాయి. అయితే ఇప్పుడు మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి సామ్సాంగ్ ప్రియులను ఉర్రూతలూగిస్తుంది. గెలాక్సీ రింగ్ 2 (Samsung Galaxy Ring 2) ఈ ఈవెంట్ లో లాంఛ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
సామ్సాంగ్ గెలక్సీ s25 సిరీస్ లాంఛ్ లో భాగంగా Samsung Galaxy S25, Galaxy S25 Ultra, Galaxy S25 Plus మెుబైల్స్ రాబోతున్నాయి. అయితే వీటితో పాటు గెలక్సీ రింగ్ 2 సైతం లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని డీజీ టైమ్స్ తన రిపోర్టులో వెల్లడించింది. గ్యాలక్సీ రింగ్ 2 అదిరిపోయే ఫీచర్స్ తో 9 డిఫరెంట్ సైజుల్లో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది సామ్సాంగ్ ఫస్ట్ జనరేషన్ గ్యాలక్సీ రింగ్ మోడల్ లో రానున్నట్లు సమాచారం. ఇక తొమ్మిది సైజుల్లో రాబోతున్న ఈ రింగ్ ఎక్కువ స్థాయిలో కస్టమర్స్ కు రీచ్ కావాలనే ఉద్దేశంతో సామ్సాంగ్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొన్నాళ్ల క్రితమే మాక్స్ జాంబోర్.. సామ్‌సంగ్ రింగ్ 2 సైజుల గురించి వెల్లడించింది. ఇది 14, 15 సైజుల్లో రాబోతుందని తెలిపింది.
సామ్సాంగ్ రెండో జనరేషన్ లో రాబోతున్న ఈ రింగ్ డిజైన్ సైతం ది బెస్ట్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. సన్నని డిజైన్ తో ఎవరైనా ధరించే విధంగా ఉండనుందని సమాచారం. ఇక ఫస్ట్ జనరేషన్ రింగ్ లో వచ్చినట్లే బెస్ట్ బ్యాటరీ సైతం రాబోతుదని.. ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాబోయో రింగ్ మరింత బెస్ట్ బ్యాటరీతో పది రోజుల వరకూ ఛార్జింగ్ ఉండేలా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్ రింగులో హెల్త్ సెన్సార్స్ తో పాటు మరింత మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ సైతం రాబోతున్నట్టు తెలుస్తుంది.
అయితే సామ్సాంగ్ గెలాక్సీ రింగ్ 2 లాంఛ్ జనవరిలో జరిగినప్పటికీ.. కొనుగోలు చేయటానికి మాత్రం ఆరు నెల సమయం పట్టేట్టు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు 2025 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం. ఇక గెలక్సీ S25 సిరీస్ లో రాబోతున్న 3 మొబైల్స్ మాత్రం ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ముందస్తు రిజర్వేషన్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం.
ఇక సామ్సాంగ్ వచ్చే ఏడాది స్లిమ్ మోడల్ మెుబైల్ ను సైతం తీసుకురాబోతుందని తెలుస్తోంది. 5000mah బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, 16 GB + 512 GB స్టోరీజ్ సదుపాయంతో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సామ్సంగ్ గెలాక్సీ S 25 మొబైల్ సైతం స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో రాబోతుంది.
ALSO READ : ఏంటి భయ్యా ఇది… ఐక్యూ కొత్త మెుబైల్ పై ఏకంగా రూ.25వేల డిస్కౌంటా!