Samsung Galaxy M05, Galaxy F05: ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ ఫోన్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. కంపెనీ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ కానున్నాయి. శాంసంగ్ కంపెనీ త్వరలో Samsung Galaxy M05, Galaxy F05 పేరుతో విడుదల చేస్తుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను సామాన్యులకు అందుబాటు ధరలో మార్కెట్లో అందించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు కంపెనీ ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్ 04, గెలాక్సీ ఎం 04లను విడుదల చేసింది. ఈ రెండు డివైజ్‌లకు అప్డేట్ వెర్షన్‌తో ఇప్పుడు ఎం05, ఎఫ్05 మోడళ్లు రానున్నాయి. దేశీయ మార్కెట్‌లో Samsung Galaxy M05, Galaxy F05 లాంచ్ దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు. తాజాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ BIS లో కనిపించాయి.
Galaxy F05 ఫోన్ తాజాగా మోడల్ నంబర్ SM-E055F/DS (డ్యూయల్ సిమ్‌కార్డ్)తో దర్శనమిచ్చింది. అదే సమయంలో Galaxy M05 ఫోన్ మోడల్ నంబర్ SM-M055F/DSతో కనిపించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ అందించబడింది. ఇప్పటి వరకు ఈ రెండు పరికరాల గురించి నిర్దిష్ట సమాచారం వెల్లడి కాలేదు. అయితే రెండు స్మార్ట్‌ఫోన్‌లు పాత మోడళ్లతో పోలిస్తే అప్‌గ్రేడ్ చేసిన సర్టిఫికేషన్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 108ఎంపీ కెమెరాతో 5జీ ఫోన్ లాంచ్.. ఏంటీ మరీ ఇంత తక్కువా..?
Samsung Galaxy M05, Galaxy F05 ధర కూడా పాత మోడల్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా పాత మోడల్‌ల స్పెసిఫికేషన్‌లను బట్టి కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు అంచనా వేయవచ్చు. Samsung Galaxy M04 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.5-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. HD+ 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. Helio P35 ప్రాసెసింగ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్‌కు మద్దతునిస్తుంది. ఇది 128 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. Android 12 ఆధారిత OneUI ఇందులో ఇవ్వబడింది. ఇది 2 సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే.. M04 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4G VoLTE, WiFi, బ్లూటూత్, GPS, USB C-పోర్ట్ ఉన్నాయి.