BigTV English

Bhatti Vikramarka: పరిశ్రమలు నెలకొల్పేందుకు.. ముందుకు వచ్చే యువతకు రుణాలు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: పరిశ్రమలు నెలకొల్పేందుకు.. ముందుకు వచ్చే యువతకు రుణాలు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka latest news(TS news updates): రాష్ట్రంలో యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలిచ్చి, వసతులు కల్పించి వారి అవసరాలు తీర్చే ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారాయన. వారు వ్యాపారం చేసుకోవడానికి పరిశ్రమలు, ప్రాజెక్టు రిపోర్టు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ వసతులు కల్పించి ప్రోత్సహిస్తామన్నారు.


ఇండస్ట్రియల్ పార్కుతో మధిర పట్టణం విద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కేంద్రంగా మారనుందని స్పష్టం చేశారు. గ్రామాల్లోని యువత పరిశ్రమల ఏర్పాటు చేస్తామంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మధిరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం దశాబ్దాల కల అన్నారు. 55 ఎకరాల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు కు 44 కోట్ల నిధులు కేటాయించామని భట్టి తెలిపారు. పనులకు వెంటనే టెండర్లు పిలిచి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Also Read: న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు


నిరుద్యోగ యువత పరిశ్రమల వైపు వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. ఇండస్ట్రియల్ పార్కును అనుసంధానించేందుకు రెండు వైపులా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ పారిశ్రామిక కేంద్రాన్ని సందర్శించేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

Related News

Telangana floods: 48 గంటల్లో 1,646 ప్రాణాలు సేఫ్.. ఈ అధికారులకు సెల్యూట్ కొట్టాల్సిందే!

Telangana floods: మీ రహదారులకు గండి పడిందా? రోడ్లు దెబ్బతిన్నాయా? వెంటనే ఇలా చేయండి!

Telangana Police: కుళ్లిన శవాన్ని మోసిన పోలీస్ అధికారి.. తెలంగాణలో హృదయాన్ని తాకిన ఘటన!

Telangana rains: భారీ వర్షాల దెబ్బ.. తెలంగాణలో భారీగా అంగన్వాడీ భవనాలకు నష్టం!

Vinayaka Chavithi: వినాయకుని పూజ కోసం రచ్చ.. ఏకంగా పూజారినే ఎత్తుకెళ్లారు!

Heavy Rains: బయటకు రాకండి.. మరో వారం రోజులు అత్యంత భారీ వర్షాలు..

Big Stories

×