Samsung Galaxy Z Fold 6: ఫోల్డబుల్ లేదా ఫ్లిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. అలాంటి స్మాన్‌ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ డేల్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో Samsung Galaxy Z Fold 6 ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంకాచెప్పాలంటే, ఈ ఫోల్డ్‌బుల్ ఫోన్ కొనుగోలు మీద బ్యాంక్ ఆఫర్స్, ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Galaxy Z Fold 6 ఫోన్ అసలు ధర రూ.1,64,999. అయితే, ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను కేవలం రూ.1,03,999 ధరకే కొనొచ్చు. మరో ఆఫర్ ఏంటంటే.. మీవద్ద ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే.. ఈ ఫోన్ మీద ఏకంగా రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ తగ్గింపు ఉంటుంది. దీని వల్ల ధర రూ.1లక్ష కంటే తక్కువకు తగ్గుతుంది. అదనంగా, దీనిపై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇది దాదాపు రూ.56,600 వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లో 6.3-అంగుళాల అమోలేడ్ ఔటర్ స్క్రీన్, 7.6-అంగుళాల అమోలేడ్ ఇన్నర్ ప్యానెల్ ఉన్నాయి. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. పరికరం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది గరిష్టంగా 12GBRAM+512GB నిల్వతో జత చేశారు. కెమెరా విభాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఇది 10-మెగాపిక్సెల్, 4-మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.