Bore Water Without Current in Mahabubabad District: కరెంట్ లేదు.. మోటార్ అవసరమే లేదు.. నిరంతరం సమృద్ధిగా నిరిచ్చే బోరు బావి ఎక్కడైనా చూశారా..? చూడలేదు కదూ.. వింత కాదు, ఇది నిజం.. మహబూబబాద్ జిల్లా గంగారం మండల కేంద్రం శివారులోనీ రైతు పంటపొలంలో భూగర్భ జలం ఉబికి పైకి వచ్చి ప్రవహిస్తోంది. కరెంటు మోటార్ల అవసరం లేకుండానే బోర్లు పొంగి పొర్లుతున్నాయి.
గడిచిన మూడు నెలలుగా వర్షాలు సమృద్దిగా కురుస్తుండటంతో భూగర్బజలాలు పెరిగాయి. బోరు పైపులను చీల్చుకుంటూ నీళ్ళు బయటకు వచ్చే ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ఇక్కడ సాధారణంగా మారాయి. 200 ఫీట్ల లోతు తవ్విన బోరు, మోటార్ అవసరం లేకుండానే పొంగి పొర్లుతోంది. ఈ ఒక్క బోరు కింద దాదాపు 10 ఎకరాలకు పైగా పొలం సాగు అవుతోంది. కరెంటు, మోటార్ ఉన్నా కూడా.. ఆ రైతు రెండు వారాలుగా మోటార్ ఆన్ చేయలేదు. ఇలా కరెంటు అవసరం లేకుండానే తమ పొలాలను బోరు బావి సస్యశ్యామలం చేయడం పట్ల ఇక్కడి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అటవీ ప్రాంతం కాబట్టి, చెట్లు ఎక్కువగా ఉండటం, సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు.
Also Read: పరిశ్రమలు నెలకొల్పేందుకు.. ముందుకు వచ్చే యువతకు రుణాలు: భట్టి విక్రమార్క
అప్పుడెప్పుడో తాతల కాలంలో లోతు బావి తవ్వితే చాలు పాతాళ గంగ ఉబికి పైకి వచ్చేదంట. కాలక్రమేణా బావుల సంగతి దేవుడెరుగు వందల ఫీట్ల బోరు బావులు తవ్వించినా గుక్కెడు నీటి జాడ కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం గంగారం మండల వాసులు మాత్రం పూర్వీకులు చెప్పినట్టు పాతాళ గంగ ఉబికి పైకి రావడాన్ని స్వయంగా చూస్తున్నారు.