E-Paper
Advertisement

Oppo Reno 15 Series: లీక్ అయిన రెనో 15 సిరీస్ రిలీజ్ డేట్, ట్రిపుల్ సర్‌ప్రైజ్ తో ఒప్పో రెడీ!

Oppo Reno 15 Series: లీక్ అయిన రెనో 15 సిరీస్ రిలీజ్ డేట్,  ట్రిపుల్ సర్‌ప్రైజ్ తో ఒప్పో రెడీ!
Advertisement

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో రెనో 15 సిరీస్ ఇండియన్ లాంచ్ డేట్ లీక్ అయ్యింది. మరికొద్ది వారాల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతున్నట్లు తేలింది. అయితే, ఈ స్మార్ట్‌ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా ఊహాగానాల ప్రకారం.. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌ సెట్‌ల ద్వారా పవర్ పొందుతుంది. బ్యాక్ సైడ్ ట్రిఫుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ గా రెనో 15 ప్రో అందుబాటులోకి రానుంది.  ఇది 6.78-అంగుళాల డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెనో 14 ప్రో కొనసాగింపుగా వస్తోంది. అటు రెనో 15, రెనో 15 మినీ వరుసగా 6.59-అంగుళాలు, 6.32-అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉండబోతున్నాయి.

ఒప్పో రెనో 15 సిరీస్ ఇండియా లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు!

తాజాగా 91 మొబైల్స్..  ఒప్పో రెనో 15 సిరీస్ రిలీజ్ కు సంబంధించి లాంచ్ టైమ్‌ తో పాటు ఒప్పో రెనో 15 లైనప్ గురించి కీలక వివరాలను లీక్ చేసింది. ఈ సిరీస్ డిసెంబర్ లో ఇండియాలో రిలీజ్ అవుతాయని వెల్లడించింది. ఈ సిరీస్ లో భాగంగా రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 మినీ విడుదల అవుతాయని తెలిపింది.

Advertisement

ఒప్పో రెనో 15 సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఒప్పో రెనో 15 ప్రో, రెనో 15 మినీ వరుసగా 6.78-అంగుళాల, 6.32-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఒప్పో రెనో 15 6.59 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్లు మెటల్ ఫ్రేమ్‌ ను కూడా కలిగి ఉండవచ్చు అంటున్నారు. ఈ లైనప్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్ కు సంబంధించి IP68+IP69 రేటింగ్‌ ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒప్పో రెనో 15 సిరీస్‌ లో డైమెన్సిటీ 8450 SoC ఉంటుందని భావిస్తున్నారు. గతంలో రెనో 15 ప్రో మాక్స్‌ గా లాంచ్ అవుతుందని భావించిన ఒప్పో రెనో 15 ప్రో, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 SoC, 6,500mAh బ్యాటరీతో వస్తుందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. రెనో 15 ప్రో 50W వైర్‌ లెస్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ ఇస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also:  వచ్చేస్తోంది e-ఆధార్ యాప్‌, ఇక మీ ఫోన్ నుంచే ఆధార్‌ అప్‌ డేట్ చేసుకోవచ్చు!

ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరా

Advertisement

ఒప్పో రెనో 15 ప్రో, రెనో 15 మినీ  కెమెరా స్పెసిఫికేషన్లు ఇటీవల ఆన్‌ లైన్‌ లో కనిపించాయి. రెండు హ్యాండ్‌ సెట్లు 200 మెగాపిక్సెల్ సామ్ సంగ్ ISOCELL HP5 ప్రైమరీ కెమెరాలు, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లను కలిగి ఉంటాయి. వీడియో కాలింగ్, సెల్పీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Read Also:  వచ్చేస్తోంది e-ఆధార్ యాప్‌, ఇక మీ ఫోన్ నుంచే ఆధార్‌ అప్‌ డేట్ చేసుకోవచ్చు!

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×