ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ సామ్ సాంగ్ తమ కస్టమర్లకు కోసం ఎప్పటికప్పుడు అదిరే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొస్తుంది. బెస్ట్ ఫీచర్ మెుబైల్స్ ను బడ్జెట్ ఫ్రెండ్లీగానే అందిస్తుంది. ఇక తాజాగా ఈ సంస్థ బిగ్ బ్యాటరీతో ఎమ్ 15 5జీ ప్రైమ్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంఛ్ చేసిన గెలాక్సీ ఎమ్ 15 5జీ ఫోన్ లో స్వల్ప మార్పులు చేసి ఈ ప్రైమ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుందని తెలిపిన సామ్ సాంగ్…. 4ఏళ్ల పాటూ ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తామని ప్రకటించింది.
తాజాగా సామ్ సాంగ్ కంపెనీ లాంఛ్ చేసిన ఎమ్ 15 5జీ స్మార్ట్ ఫోన్ అదిరే ఫీచర్లతో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఎడిషన్ ను 4GB+128GB, 6GB+128GB, 8GB+128GBగా మొత్తం మూడు వేరియంట్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 4GB+128GB విలువ రూ.10,999, 6GB+128GB ధర రూ.11,999, 8GB+128GB వేరియంట్ ధర రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ టోపాజ్, సెలిస్టెయిల్ బ్లూ, స్టోన్ గ్రే రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్ ఫోన్ ను… అమెజాన్, శాంసంగ్ తో పాటూ అన్ని రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
సామ్ సాంగ్ ఎమ్ 15 5జీ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. ఇక సూపర్ అమ్లోడ్ డిస్ ప్లే 90Hz రిఫ్రెష్ రేటుతో పనిచేయనుంది. వీటితో పాటూ మీడియా టెక్ డైమెన్‌సిటీ 6100+ ప్రాసెసర్, ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో ఈ ఫోన్ ను లాంఛ్ చేశారు. సామ్ సాంగ్ వన్‌యూఐ 6.0తో పనిచేసే ఈ ఫోన్ కు మరింత వెసులుబాటు కలిపిస్తూ 4 ఏళ్లపాటూ ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్లపాటూ సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సామ్ సాంగ్ కంపెనీ ప్రకటించింది.
ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే…. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 MP ప్రధాన కెమెరాతో పాటూ 5 MP, 2 Mp కెమెరాలు ఉండనున్నాయి. ఫ్రెంట్ కెమెరా 13 MPగా ఉండనుంది. 6,000 MAH బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ కు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ సదుపాయం కూడా ఉంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి సదుపాయాలు కలిపిస్తూ ఈ ఫోన్ ను సామ్ సాంగ్ లాంఛ్ చేసింది. ఈ ఎడిషన్ ఫోన్స్ లో హ్యాండ్ సెట్ 160.1 x 76.8 x 9.3ఎమ్ఎమ్ ఉండగా.. 5.3 బ్లూటూత్ సదుపాయం కూడా ఉంది. ఇక 217గ్రాములు బరువుతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
READ ALSO : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!
ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన గెలాక్సీ ఎమ్ 15 5జీ స్మార్ట్ ఫోన్ 6100 మీడియా టెక్ డైమెన్‌సిటీను కలిగి ఉంది. ఇక 8GB ROM సదుపాయంతో పాటూ 6,000MAH బ్యాటరీ సదుపాయం కలిగి ఉంది. 50 మెగా పిక్సల్ కెమెరాతో పాటూ 30 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో లాంఛ్ అయింది. ఇక ప్రస్తుతం ఈ ఫోన్ కు స్వల్ప మార్పులు చేసి ఎమ్ 15 5జీ స్మార్ట్ ఫోన్ ను సామ్ సాంగ్ అందుబాటులోకి తెచ్చింది సామ్ సాంగ్.