E-Paper
Advertisement

Bhagavanth Kesari: బాలయ్యా.. మజాకానా.. మొన్న సైమా.. రేపు ఐఫా

Bhagavanth Kesari: బాలయ్యా.. మజాకానా.. మొన్న సైమా.. రేపు ఐఫా
Advertisement

Bhagavanth Kesari:  నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆడపిల్లను ఎలా పెంచాలి.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి అనే మెసేజ్ తో అనిల్  రావిపూడి ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ఆ  డైలాగ్స్  బాలయ్య చెప్పడంతో మరింత రీచ్ వచ్చింది.

ఇక ఈ సినిమా  మంచి విజయంతో పాటు.. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్యనే  సైమా అవార్డ్స్ 2024 లో ఉత్తమ చిత్రంగా భగవంత్  కేసరి నిలిచిన విషయం తెల్సిందే. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా నిర్మాత సాహు గారపాటి ఈ అవార్డును అందుకున్న విషయం విదితమే.

Advertisement

ఇక తాజాగా   ఈ సినిమా మరో అవార్డును అందుకోవడానికి సిద్దమయ్యింది. ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుగా గుర్తింపు తెచ్చుకుంది ఐఫా.  ప్రతి ఏడాది  ఇండస్ట్రీలో వచ్చిన ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ ను అందజేస్తుంది. ఇక ఐఫా 2024 మొదలయ్యింది.  సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు ఈ వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్  తో పాటు అన్ని వుడ్స్ కు సంబంధించిన  తారలు దుబాయ్ కు చేరుకున్నారు.

టాలీవుడ్ తరపున రానా, కుర్ర  హీరో తేజ సజ్జా హోస్ట్స్ గా వ్యవహరించనున్నారు. ఇక తాజాగా అందుతున్న  సమాచారం ప్రకారం ఐఫాలో కూడా భగవంత్  కేసరి తన సత్తా చాటిందని తెలుస్తోంది. ఉత్తమ చిత్రంగా ఐఫా 2024 లో భగవంత్ కేసరి ఎంపిక అయ్యినట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది  దుబాయ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ విషయం తెలియడంతో  బాలయ్య ఫ్యాన్స్.. బాలయ్యా.. మజాకానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అఖండ 2 ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×