E-Paper
Advertisement

నాగేశ్వ‌ర్‌ ఎపిసోడ్‌.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌! ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..

నాగేశ్వ‌ర్‌ ఎపిసోడ్‌.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌! ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..
Advertisement

ఊర్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి.. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌. సంద‌ర్భం వేరు. విజ‌య్‌ను త‌న‌ను పోల్చి చూస్తూ చిరాకు పెడుతున్నార‌ని ఇలా తిట్టిపోశాడు త‌మ నేత‌ల‌ను, జ‌గ‌న్ గ్యాంగ్‌ను. కానీ ఇదే మాట‌లు ఇప్పుడు నాగేశ్వ‌ర్ ఎపిసోడ్ విష‌యానికి స‌రిగ్గా న‌ప్పుతున్నాయి. అమిత్ షాతో త‌న‌ను అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టుగా నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ చేయ‌డంపై ప‌వ‌న్ పెద్ద వివాద‌మే లేప‌డం… ఆ త‌రువాత ఇది కూట‌మి స‌ర్కార్‌కే ఇబ్బందిక‌రంగా మార‌డంతో ఇద్ద‌రూ వెన‌క్కి త‌గ్గారు. నాగేశ్వ‌ర్ క్ష‌మాప‌ణ చెప్పాడు. ప‌వ‌న్ సైలెంట్ అయ్యాడు.

ఇది అక్క‌డితో ఒడిసింద‌నుకున్నారు. కానీ ఇక ఇక్క‌డే మొద‌లైంది అస‌లు క‌థ‌. నాగేశ్వ‌ర్‌కు తెలంగాణ వాదాన్ని అంట గ‌ట్టారు. మా తెలంగాణ జ‌ర్న‌లిస్టు అని ఓన్ చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి.. బూతుల మాట‌లు.. రోత‌ల కామెంట్ల‌తో రెచ్చిపోయారు. జ‌ర్న‌లిస్టుల్లా మాట్లాడ‌లేదు. సంయ‌మ‌నం పాటించ‌లేదు. మ‌హిళ‌ల‌ను కూడా చూడ‌లేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిట్టిపోశారు. ఇది మ‌రింత అగ్నికి ఆజ్యం పోసినట్ట‌య్యింది. జ‌న‌సేన అక్క‌డే మీటింగు పెట్టి.. వీళ్లూ తుక్కు తుక్కు తిట్టారు. నాగేశ్వ‌ర్ ఎక్క‌డో చ‌ల్ల‌గా ఏసీలో ప‌డుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప‌వ‌న్ త‌న రాజ‌కీయాల్లో త‌ను బిజీ బిజీగా ఉన్నాడు. బాబు మ‌హానాడులో తీర్మానాలు రాసే ప‌నిలో త‌ల‌మున‌క‌లై.. కొడుకును సీఎం చేసే తీర్మానం ఎలా ప్ర‌వేశ‌పెట్టాలో అని తెగ ఆలోచిస్తూ ధిమాక్ ఖ‌రాబ్ చేసుక‌కుంటున్నాడు.

Advertisement

ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇక్క‌డే తెలంగాణ‌లో కొంద‌రు ఖాళీగా ఉన్నారు.. ఎంత ఖాళీగా ఉంటే.. దారిన పోయే కంప‌ను ముడ్డికి త‌గిలించుకున్న‌ట్టు.. ఒడిసిన ముచ్చ‌ట‌ను ప‌ట్టుకుని త‌మ ప‌బ్బం గడుపుకున్న‌ట్టే చేస్తున్నారు. ఓ ద‌శ‌లో ఆ నాగేశ్వ‌ర్‌కే చిర్రొత్తుకొచ్చింది. అరేయ్‌.. ఆపండ్రా.. ఆపండ్రా…రేయ్..! అని గొంతు చించుకోవాల‌ని అనిపించి ఉంటుంది.అంత‌లా రోత‌, విసుగు పుట్టించేలా కామెంట్లు, ప్రెస్‌మీట్లు, స్పంద‌న‌లు.. ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌గా మారింది నాగేశ్వ‌ర్ ఎపిసోడ్‌. దీనికి ఎక్క‌డ బ్రేక్ ప‌డుతుందో తెలియ‌దు.

అన‌వ‌స‌రంగా దీన్ని కెలికి పెద్ద చేసుకున్న‌ది ప‌వ‌నే. ఏవో నాలుగు మాట‌లు చెప్పుకుని త‌న ప‌ని తాను చేసుకుపోయే నాగేశ్వ‌ర్‌ను రోడ్డు మీద‌కు లాగి.. తాను రోడ్డెక్కి నానా యాగీ చేసి ర‌చ్చ ర‌చ్చ చేసుకుని .. నాగేశ్వ‌ర్ చేత క్ష‌మాప‌ణ చెప్పించుకునే దాకా వ‌ద‌ల్లేదు. అప్పుడు గాని ప‌వ‌న్‌కు మ‌న‌సు కుద‌ట‌ప‌డ్లేదు. ఆలోగా జ‌ర‌గాల్సిందంతా జ‌రిగింది. ఆ త‌రువాత కూడా మ‌రో టీమ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా తిట్టేందుకు.. వ్య‌క్తిత్వ హ‌ననం చేసేందుకు. దీనికి నాగేశ్వ‌రే ఓ వీడియో చేసి మీకు దండంరా దూత‌.. ఇక ఆపండి.. మీ కాల్మొక్తా బాంచ‌న్… ! అంటే త‌ప్ప ఆగ‌డం లేదు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×