E-Paper
Advertisement

జియో యూజర్లకు షాక్.. మాయమైన బడ్జెట్ ప్లాన్లు.. అసలేం జరిగిందంటే?

జియో యూజర్లకు షాక్.. మాయమైన బడ్జెట్ ప్లాన్లు.. అసలేం జరిగిందంటే?
Advertisement

Jio Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొన్ని తక్కువ ధర (బడ్జెట్) రీఛార్జ్ ప్లాన్లను సైలెంట్‌గా నిలిపివేసింది. దీంతో తమ నెలవారీ బడ్జెట్‌ ప్లాన్ ను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో తెలియక.. యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ జియో తొలగించిన బడ్జెట్ ప్లాన్లు ఏవి? ఇందుకు కారణం ఏంటి? ఇన్నాళ్లు వాటి వల్ల యూజర్లకు కలిగిన బెనిఫిట్స్ ఏవి? ఈ కథనంలో చూద్దాం.

మాయమైన ప్లాన్స్ ఇవే!

ఇన్నాళ్లు తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, డేటా అందించిన కొన్ని కీలకమైన ప్లాన్లు ప్రస్తుతం జియో యాప్, వెబ్‌సైట్లలో కనిపించడం లేదు. ఎంతో పాపులర్ అయిన రూ.209, రూ.249 ప్లాన్ లు అదృశ్యమయ్యాయి. ఇంతకాలం నెలకు సరిపడ డేటా, వ్యాలిడిటీని అందించిన ఈ ప్లాన్లు.. ప్రస్తుతం లేకపోవడం యూజర్లకు నిజంగా ఎదురుదెబ్బేనని టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ ప్లాన్స్ బెనిఫిట్స్ ఏంటి?

Advertisement

జియో తొలగించిన రూ.204 ప్లాన్ విషయానికి వస్తే.. ఇది 22 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉండేది. ప్రతీ రోజూ కస్టమర్లకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందించేది. అటు రూ.249 ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో గతంలో జియో అందుబాటులో ఉంచింది. ఇది కూడా రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేసేది. ప్రస్తుతం ఈ ప్లాన్స్ ను తొలగించి.. వాటి స్థానంలో బేసిక్ ఎంట్రీ లెవల్లో రూ.299 ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. ఇది రోజుకు 1.5 GB డేటా, ఫ్రీకాల్స్, ఎస్ఎంఎస్ లను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.

Also Read: అసలేంటీ ‘స్టార్ రేటింగ్’ కథ? కరెంటు బిల్లుకు దానికి లింకేంటి? తప్పక తెలుసుకోవాల్సిందే!

తొలగింపునకు కారణం ఏంటంటే?

Advertisement

ఇన్నాళ్లు చౌకైన ప్లాన్స్ కు పరిమితమైన యూజర్లను అధిక ధర ప్లాన్ల వైపు మళ్లించేందుకు జియో రూ.209, రూ.249 ప్లాన్లను తొలగించినట్లు మార్కెట్లు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తన సగటు రాబడిని పెంచుకునేందుకు ఇలాంటి చౌకైన ప్లాన్లను రద్దు చేసి.. కస్టమర్లను ప్రీమియం ప్లాన్ల వైపునకు మళ్లించాలని జియో చూస్తోందని పేర్కొంటున్నారు. ఫలితంగానే ఒకప్పుడు రూ.249కే నెల రోజుల పాటు 1GB డేటా పొందిన కస్టమర్లు.. ఇప్పుడు రోజుకు 1.5GB డేటా అందించే కనీస రూ.299 ప్లాన్ ను ఎంచుకోక తప్పడం లేదని వివరిస్తున్నారు.

Also Read: విజయ్ దేవరకొండకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఫ్యాన్స్ ఫిదా..

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×