
Smart House Gadgets : ఎవరికైనా తమ ఇంటిని స్మార్ట్ హౌస్‌గా మార్చుకోవాలని ఉంటుంది. కానీ, అందుకు అవసరమైన, ఖరీదైన వస్తువులను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అయితే, తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో దొరికే రెండు ముఖ్యమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏంటో చూద్దాం.
సోలార్ లైట్
మీ ఇంట్లో కరెంట్ బిల్‌ను తగ్గించుకోవాలంటే.. ఈ సోలార్ లైట్‌ను కొనుక్కోవడం ఉత్తమం. ఇంటి బయట వీటిని ఫిట్ చేసుకుంటే.. పగలంతా సూర్యకిరణాలను గ్రహించి.. ఎలాంటి విద్యుత్ ఖర్చు లేకుండా రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. మనుషులు ఉన్నప్పుడు ఎక్కువ లైట్.. మనుషులు లేనప్పుడు తక్కువ లైట్‌ను ప్రసరిస్తాయి. దీంతో రాత్రంతా మీ ఇంటికి వెలుగునిస్తాయి. ఆన్‌లైన్‌లో వీటి ప్రారంభ ధర రూ.500 ఉంటుంది.
బ్యాగ్ సీలర్
పిల్లలు తినే చిప్స్ దగ్గర నుంచి వంటింటిలో వాడే సరుకుల వరకు ప్రతీదీ ప్యాకెట్ రూపంలోనే వస్తున్నాయి. వాటిని ఒక్కసారి ఓపెన్ చేస్తే పాడైపోతాయి. అలా పాడవకుండా ఈ బ్యాగ్ సీలర్ ఉపయోగపడుతుంది. ఏ ప్లాస్టిక్ కవర్‌ను అయినా ఈ సీలర్ మధ్యలో ఉంచి నొక్కితే సీల్ అయిపోతుంది. అలాగే ఈ సీలర్ వెనుక ఉన్న కటర్‌తో ప్యాకెట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో దీని ధర రూ.500లోపే ఉంటుంది.