BigTV English
Advertisement

BJP Downfall : మోదీ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం నిజమా?.. ఈటల వల్లే బీజీపీ పతనమైందా?

BJP Downfall | తెలంగాణలో కొన్ని నెలల క్రితం వరకు బీజేపీ ఒక బలమైన పార్టీ. అధికార బీఆర్ఎస్‌కు గట్టి పోటీ నిచ్చే ప్రతిపక్షంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్‌లో జోష్ రావడానికి కర్ణాటక విజయం అని చెప్పొచ్చు. ఇంతవరకూ ఓకే.. కానీ బలంగా కనిపించే బీజేపీ ఒక్కసారిగి బలహీనపడిపోయింది. కేసీఆర్ పార్టీపై విమర్శలు తగ్గించేసింది. బీజేపీలో సీనియర్ నేతలతోపాటు.. కొత్తగా చేరిన నేతలు కూడా వరుసగా పార్టీని వీడుతున్నారు.

BJP Downfall : మోదీ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం నిజమా?.. ఈటల వల్లే బీజీపీ పతనమైందా?
political news today telangana

BJP Downfall in Telangana(Political news today telangana):

తెలంగాణలో కొన్ని నెలల క్రితం వరకు బీజేపీ ఒక బలమైన పార్టీ. అధికార బీఆర్ఎస్‌కు గట్టి పోటీ నిచ్చే ప్రతిపక్షంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్‌లో జోష్ రావడానికి కర్ణాటక విజయం అని చెప్పొచ్చు. ఇంతవరకూ ఓకే.. కానీ బలంగా కనిపించే బీజేపీ ఒక్కసారిగి బలహీనపడిపోయింది. కేసీఆర్ పార్టీపై విమర్శలు తగ్గించేసింది. బీజేపీలో సీనియర్ నేతలతోపాటు.. కొత్తగా చేరిన నేతలు కూడా వరుసగా పార్టీని వీడుతున్నారు.


దీనికి వెనుక కారణాలేంటని పరిశీలిస్తే..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకప్పుడు తెలంగాణలో కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపించింది. అసలు కేసీఆర్‌ను గద్దె దింపేది బీజేపీనే అని చాలా మంది అనుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో బలహీనంగా మారింది. ఇక కాంగ్రెస్ ఫినిష్ అని అంతా అనుకున్నారు. అనూహ్యంగా కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్.. తెలంగాణలో పార్టీలో జోష్ నింపింది. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా పార్టీలో బలమైన నాయకులను తీసుకొచ్చారు.

ఈ పరిణామాలతో అధికార బీఆర్ఎస్, బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇంతకాలం కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకున్న బీఆర్ఎస్ ఒక్కసారగి నిద్రలేచింది. బీజేపీ కూడా ఇక తనే ప్రధాన ప్రతిపక్షమని భావించింది. కానీ కాంగ్రెస్ బలం రోజురోజుకీ పెరిగిపోతుండడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైపోయారని అనుమానాలు కలుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజంగానే అవినీతి ఉందని వారు భావిస్తే.. కేంద్రంలో అధికారమున్న బీజేపీ ఇన్ కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడి లాంటి ఏజెన్సీలతో విచారణ ఎందుకు చేయలేదు. అందరు ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఎన్నో కేసులను పెట్టిన కేంద్రం.. ఇంతవరకూ కేసీఆర్, కేటీఆర్‌పై ఎందుకు ఎలాంటి కేసులు పెట్టలేదు.


నిజంగానే కేసీఆర్‌కు బీజేపీ వ్యతిరేకమైతే.. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో కేసీఆర్ కూతరు ఎమ్ఎల్సీ కవితను ఇంతవరకు అరెస్టు చేయలేదు. పైగా ఆమె కేసు విచారణ కూడా చల్లబడిపోయింది. ఇవే అనుమానాలు బీజేపీ, ఎంఐఎం పార్టీలపై కూడా ఉన్నాయి. మోదీని, అదానీని విమర్శించే అందరు నాయకులపై కేసులున్నాయి. కానీ ఇంతవరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీపై ఎటువంటి కేసులు లేవు. పైగా అక్బరుద్దీన్ ఒవైసీ ఒక విద్వేషపూరిత మత ప్రసంగం చేస్తే.. ఆయనను కోర్టు చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అదే రాహుల్ గాంధీ.. మోదీ పేరు గలవారంతా దొంగలేనా అని అన్నందుకు ఆయనకు రెండేళ్లు జైలు అని కోర్టు తీర్పునిచ్చింది. రాహుల్ లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. కేసీఆర్ రెండో సారి ఎన్నికల్లో గెలిచాక… బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఆ తరువాత ఈటలపై భూ కబ్జాల కేసులు నమోదయ్యాయి. ఈటల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. అంతే ఇక ఈటలకు వ్యతిరేకంగా ఉన్న కేసులన్నీ.. మూలన పడిపోయాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వెనుక అసలు కేసీఆర్ ప్లాన్ ఉందని వాదనలు మొదలయ్యాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని ఆ పదవి నుంచి తొలగించారు. అంతకుమందు కొన్ని రోజుల క్రితమే.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీతో కలిశారు. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేయడమేనని అనుమానాలున్నాయి. ఇదంతా ఈటల రాజేందర్ బీజేపీలో ఉండి నడిపించారని అప్పుడే వార్తలొచ్చాయి. బండి సంజయ్‌ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో మిగతా నాయకులంతా ఒక్కొక్కరిగా బీజేపీని వదిలి వేరే పార్టీలలో చేరడంలో మొదలుపెట్టారు. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించాలి.

అంతకాలం మోదీని సందర్భం వచ్చినప్పుడల్లా తిట్టిన కేసీఆర్, కేటీఆర్ ఒక్కసారిగి బీజేపీ పట్ల మెతక వైఖరి చూపించడం మొదలుపెట్టారు. మోదీ తనకు మంచి మిత్రుడని కేసీఆర్ అన్నారు. అలాగే బీజేపీ అంటే తమకు విరోధం లేదని కేటీఆర్ అన్నారు. అలాగే మోదీ కూడా ఈ మధ్య కేసీఆర్ తమ ప్రభుత్వంలో చేరేందుకు అడిగారని బహిరంగ సభలో వెల్లడించారు.

దీంతో రాజకీయ వర్గాల్లో అయోమయం మొదలైంది. అసలు బీజేపీ, బీఆర్ఎస్ మద్య ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. బీజేపీలో కొందరు కేసీఆర్ వ్యతిరేకులు ఉన్నారు. వారు ఇదంతా తెలిసి షాకయ్యారు. తెలంగాణలో ఎన్నికల తరువాత బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ కూడా జాతీయ పార్టీ నినాదాన్ని పక్కన పెట్టేశారు. కొన్ని నెలల తరువాత జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్య పోనకర్లేదు.

Related News

Digital Gold Scam Alert: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!

Jubilee Hills By-Election: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Big Stories

×