BigTV English

Smart Phone Tips : మీ ఇంట్లో వయోవృద్ధులు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. మరి ఈ టిప్స్ చెప్పేయండి!

Smart Phone Tips : మీ ఇంట్లో వయోవృద్ధులు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. మరి ఈ టిప్స్ చెప్పేయండి!

Smart Phone Tips : ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అత్యవసరంగా మారిపోయింది. 50, 60 ఏళ్ల వాళ్ల వరకు ఓకే కానీ అంతకన్నా పెద్ద వయసు ఉన్నవారిలో చాలా మంది వయోధికులు స్మార్ట్ ఫోన్లను వాడేందుకు తికమక పడుతుంటారు. పాత కాలపు వారైతే కష్టపడుతుంటారు. స్మార్ట్​ ఫోన్లలో ఉండే చాలా ఫీచర్స్, ఆప్షన్ల వల్ల గందరగోళానికి గురౌతుంటారు. ఒకటి నొక్కబోయి మరొకటి నొక్కుతుంటారు. ఇంట్లో పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉంటే ఆ పెద్దవారికి ఆ స్మార్ట్​ ఫోన్లలో వారికి కావాల్సింది నొక్కి ఇస్తుంటారు. కానీ కొంతమంది వయోధికుల ఇంట్లో వారు ఉండకపోవచ్చు.


అయినప్పటికీ వయోధికులు… చదువులు, ఉద్యోగాల పేరుతో దూరంగా ఉండే తమ పిల్లలకు వీడియో కాల్‌ చేసి మాట్లాడటం దగ్గరి నుంచి కూరగాయలు, సరకులు కొనటానికి డబ్బులు చెల్లించటం వరకూ ఎన్నె పనులకు ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించాలి అనుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కొన్ని కారణాల వల్ల చాలా మంది వయోధికులకు స్మార్ట్ ఫోన్ల వాడటం రాదు. కాబట్టి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొన్ని సెటింగ్స్‌ మారిస్తే వారు తేలికగా వాడుకునేలా చేయొచ్చు. అదెనాలో ఇక్కడ తెలుసుకుందాం.

ALSO READ : జియో మరో కొత్త సంచలనం – కంప్యూటర్​గా మారనున్న మన ఇంట్లో టీవీలు!


ఫాంట్‌ సైజ్​ పెద్దగా – స్మార్ట్‌ ఫోన్లలో అక్షరాలు చిన్నగా ఉండటం వల్ల సరిగ్గా కనపడక వయోధికులు చదవడానికి కష్టపడుతుంటారు కాబట్టి ముందుగా చేయాల్సింది ఫాంట్‌ సైజును పెంచటం. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సెటింగ్స్‌లోకి వెళ్లి, డిస్‌ప్లేపై క్లిక్ చేయాలి. అందులో కిందికి వెళ్తే డిస్‌ప్లే సైజ్‌ అండ్‌ టెక్స్ట్‌ ఉంటుంది. అందులో సిస్టమ్‌ ఫాంట్, ఫాంట్‌ సైజ్‌ అండ్‌ స్టైల్‌ వంటి ఆప్షన్లు ఉంటాయి. ఫాంట్‌ సైజును సెలెక్ట్ చేసుకుని అందులో టెక్స్ట్‌ సైజు ఆప్షన్‌ ద్వారా కావాల్సిన సైజులో ఫాంట్​ సెట్‌ చేయాలి. దీంతో వయోధికులు ఎంచక్కా అక్షరాలు కనపడతాయి.

కాల్‌ షార్ట్‌కట్స్‌ – వయోధికులు కాంటాక్ట్‌లను వెతక్కోవటం కష్టం. కాబట్టి ఈజీగా కాల్‌ చేసేలా డైరెక్ట్‌ డయల్‌ విడ్జెట్​లో కాల్‌ షార్ట్‌కట్స్‌ను పెట్టుకోవాలి. హోం స్క్రీన్‌లో ఖాళీగా ఉన్న చోట మనకు కావాల్సిన కాంటాక్ట్​ను పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని తాకి ఈజీగా కాల్‌ చేసుకోవచ్చు.

లాంచర్ల సాయం – ఇవి హోం స్క్రీన్‌ చక్కగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవటానికి, అవసరాలకు అనుగుణంగా ఇష్టమొచ్చినట్టుగా మార్చుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈజీగా వాడుకోవటానికి ఉండే ఇంటర్ఫేస్‌ లాంచర్లను మనం ఎంచుకోవాలి. ఐకన్లు, టెక్స్ట్‌ సైజు పెద్దగా ఉన్నవైతే మరీ మంచిది. సింపుల్‌ లాంచర్, బిగ్‌ లాంచర్, హెల్ప్‌ లాంచర్‌ వంటివి వయోధికులకు బాగా యూజ్ అవుతాయి. వీటిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తేలికగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆ యాప్స్‌ డిలీట్‌ – ఆండ్రాయిడ్‌ ఫోన్లలో చాలా యాప్స్‌ ఉంటాయి. వాటిలో అవసరం లేని వాటిని, వయోధికులకు ఉపయోగపడని వాటిని తీసేయాలి. ఎందుకంటే అవసరం లేని యాప్స్‌ వారిని తికమక పడేలా చేస్తాయి. అలాగే ఫోన్‌లో ఎక్కువ స్టోరేజ్‌నీ తీసుకుంటాయి. కాబట్టి వాడని డిలీట్‌ చేయటమే మంచిది.

కీబోర్డు సైజు ఎత్తుగా – ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీబోర్డును పెద్దగా, విశాలంగా పెట్టుకునేలా ఆప్షన్‌ ఉంటుంది. ఇది ఆయా కంపెనీల స్మార్ట్‌ ఫోన్లను ఆధారంగా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అయితే జీ బోర్డు ముందుగానే లోడ్‌ అయి ఉంటుంది. ఇందులో కీబోర్డు సైజ్​ను మార్చుకోవటానికి రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. ముందుగా టెక్స్ట్‌ను ఇన్‌సర్ట్‌ చేయటానికి వీలు కల్పించే ఏ యాప్‌నైనా ఓపెన్‌ చేసుకోవాలి.

ఉదాహరణకు వాట్సప్‌ ఓపెన్‌ చేస్తే అందులో మెసేజ్‌ టైప్‌ చేసే ఫీల్డ్​పై తాకగానే కీబోర్డు వస్తుంది అక్షరాలకు పైన ఉండే చక్రం గుర్తుపై తాకాలి. అప్పుడు సెటింగ్స్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ప్రిఫరెన్సెస్​పై తాకితే కింద జాబితా వస్తుంది. వాటిల్లో కీబోర్డు హైట్​పై క్లిక్ చేసి అవసరమైన విధంగా సైజ్​ను పెంచుకోవచ్చు. కొన్ని కీబోర్డుల్లో అయితే చక్రం గుర్తుగా బదులుగా నాలుగు చదరాల గుర్తు కనిపిస్తుంది. దాన్ని తాకితే రీసైజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని ద్వారా సైజును మార్చుకోవచ్చు.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×