PSLV- C61: ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సి61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందని.. దీంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో ప్రకటించింది.
PSLV-C61 ప్రయోగం అసంపూర్తి
ఇవాళ తెల్లవారుజామున సరిగా 5 గంటల 59 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ – సి 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్-09 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి తీసుకెళ్లింది. తొలి రెండు దశలను విజయవంతంగా అధిగమించిన పీఎస్ఎల్వీ -సీ 61 రాకెట్‌లో.. మూడో దశలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రయోగం విఫలమైంది.
లోపం ఎక్కడుందో విశ్లేషిస్తామన్న ఇస్రో ఛైర్మన్
పీఎస్‌ఎల్‌వీ – సి 61 ప్రయోగంలో సాంకేతి సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. కౌంట్ డౌన్ తర్వాత పీఎస్‌ఎల్‌వీ – సి 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందన్నారు. తొలి రెండు దశలను విజయవంతంగా ఛేదించామని చెప్పారు. అయితే మూడో దశలో రాకెట్‌లో టెక్నికల్ ఇష్యూ రావడంతో..మూడో దశ దాటలేదన్నారు. అయితే సాంకేతిక సమస్యపై విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
ఈవోఎస్-09గా పిలవబడే రీశాట్-1 ఉపగ్రహాన్ని…
ఈవోఎస్-09 అనేది అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. 1,710 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇది దేశ సరిహద్దుల్లో నిఘా నేత్రంలా పనిచేస్తుంది. భద్రత, రక్షణ నిమిత్తం శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతుంది. ఇది పగలు రాత్రి అన్న తేడా లేకుండా.. మేఘాలు కమ్ముకుని వర్షం పడుతున్నా.. దట్టమైన పొగమంచు కమ్ముకున్నా శత్రువుల కదిలికలపై అప్‌డేట్ ఇస్తుంది. భూ ఉపరితలాన్ని హై రిజల్యూషన్‌తో ఫొటోలు తీసి రక్షణ విభాగానికి పంపుతుంది.
రోదసిలో 50కి పైగా భారత ఉపగ్రహాలు
ప్రస్తుతం స్పేస్‌లో భారత్‌కు ఇప్పటికే 50కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి తోడవనుంది. ఇప్పటికే అధునాతన కార్టోశాట్-3 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తిరుగుతూ ఫొటోలు పంపుతోంది. కానీ అది రాత్రి వేళల్లో పనిచేయదు. దీంతో శత్రువులు రాత్రి వేళల్లో సరిహద్దులు దాటగలుగుతున్నారు. తమ ఆయుధాలను తరలించగలుగుతున్నారు.ఈ తాజా ప్రయోగంతో ఉగ్రవాదులు, పాక్ సైనికుల ఆగడాలకు చెక్ పెట్టనున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫానులను ఈ ఉపగ్రహం ముందే పసిగట్టి అలర్ట్ చేయనుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగా పసిగట్టనున్న ఈవోఎస్-09
2008లో ముంబై దాడులు జరిగినప్పుడే భారత ప్రభుత్వం ఈ ప్రయోగానికి పునాది వేసింది. అయితే అప్పుడు తలపెట్టిన ప్రయోగం టెక్నికల్ సమస్యలతో విఫలం అయింది. ఇక పహల్గామ్ దాడి తర్వాత ఈ ప్రయోగం తప్పనిసరి అయింది. జనవరిలో రోదసిలోకి ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని పంపినా.. సాంకేతిక సమస్యలతో నిర్దేశించిన కక్ష్యలోకి వెళ్లలేకపోయింది. నిజానికి ఈవోఎస్- 09 ప్రయోగం జూన్‌లో జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పనుల్లో వేగం పెంచారు. అనుకున్న సమయానికి దాదాపు నెల రోజుల ముందే ఉపగ్రహాన్ని రెడీ చేశారు.
ముంబై దాడుల సమయంలో ప్రయోగానికి ఇస్రో నాంది
సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి భారత్‌కు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎల్‌ఓసీనే కాకుండా.. చైనా, బంగ్లాదేశ్‌ల వెంబడి సొరంగాలు తవ్వుకుని ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. బార్డర్‌లో సైనికులు ఉన్నా.. పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం అసాధ్యంగా మారింది. అయితే ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే అన్ని సరిహద్దుల్లో భారత్ పటిష్టమైన నిఘా వ్యవస్థను కలిగి ఉన్నట్లవుతుంది.
సరిహద్దుల్లో సొరంగాల తవ్వకాలకు చెక్
PSLV-C61 రాకెట్ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలోనూ భారత్ పట్టు మరింత పెరగనుంది. రీశాట్-1బీతో దేశ రక్షణ రంగానికి మరింత బలం చేకూరనుంది. సరిహద్దుల్లో నిఘా మరింత కట్టుదిట్టం కానుంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధానికి ఈ ప్రయోగం అత్యంత కీలకంగా మారనుంది.
Also Read: కేదార్‌నాథ్‌లో చేతిలోనే మరుగుతున్న నీరు.. దీని వెనకున్నది శివుడా, లేక శాస్త్రమా?
ఈఓఎస్-09 ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం ఐదేళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్‌తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లూ ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఈఓఎస్-09 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇది రీశాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఈ ఉపగ్రహం రిసోర్స్‌శాట్, కార్టోశాట్, రీశాట్-2బి సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించి చేరవేయనుంది. 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్-09ను పంపారు.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C61, which carries the EOS-09 (Earth Observation Satellite-09) into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh.
EOS-09 is a repeat satellite of EOS-04, designed with the mission objective to ensure remote… pic.twitter.com/4HVMZzXhP0
— ANI (@ANI) May 18, 2025