Single Movie OTT : యూత్ ఆడియన్స్ నాడిని తెలుసుకున్న హీరో శ్రీ విష్ణు వాళ్లని మెప్పించేలా సినిమాలను చేస్తున్నాడు. కామెడీ, హారర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. గ తేడాది వచ్చిన స్వాగ్ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సింగిల్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ అటు కలెక్షన్లను కూడా భారీగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల కన్నా ఓవర్సీస్ లో ఎక్కువగా దుమ్ము దులిపేసింది. ఒకవైపు థియేటర్లలో రన్ అవుతున్న కూడా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అయితే ఈ మూవీ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం..
సింగిల్ మూవీ ఓటీటీ..
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు కామెడీ ఎంటర్టైనర్ గారు పొందిన చిత్రం సింగిల్.. ఇందులో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇవానా నటనకు అయితే కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి ముందు ఆమె ‘లవ్ టుడే’ ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరోసారి ప్రేక్షకులకు దగ్గర అయింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మొదటి రోజు నుంచి సక్సెస్ఫుల్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ను ఓటిటిలో చూసేందుకు తెలుగు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా జూన్ 12న ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ముందుగానే రాబోతుందని టాక్.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read :రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే.. సినిమా మాత్రం కాదు…
కలెక్షన్స్ చూస్తే..
మొదటి వారం లో 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ థియేటర్స్ లో రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదు. ఇకపోతే ఈ నెల మొత్తం ఖాళీనే కాబట్టి, ఈ చిత్రానికి వచ్చే వారం వరకు మంచి థియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. అయితే ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. కానీ ముందుగా అనుకున్న దాని ప్రకారం చూస్తే నాలుగు వారాలకు ఓటిటిలోకి రావాలి. ఇక్కడ థియేటర్లలో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఏ మూవీ అక్కడ ఎలాంటి టాక్ తో దూసుకుపోతుందో చూడాలి..