BigTV English

PMAY-G Scheme: ప్రజలకు కేంద్రం శుభవార్త.. ఆ స్కీమ్ పొడిగింపు

PMAY-G Scheme: ప్రజలకు కేంద్రం శుభవార్త.. ఆ స్కీమ్ పొడిగింపు

PMAY-G Scheme:  సొంతింటి కలను నిజం చేసుకునేవారికి తీసి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పట్టణ, గ్రామీణ లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. తాజాగా ఈ ఏడాది అంటే డిసెంబర్ 2025 చివరి వరకు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మధ్య, పేద తరగతి ప్రజలకు ఊహించని శుభవార్త.


ఈ స్కీమ్ ద్వారా సొంతిల్లు కల సాకారం చేసుకునేందుకు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ చివరివరకు పొడిగిస్తూ పేదలకు ఉపశమనం కల్పించింది మోదీ సర్కార్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం షెడ్యూల్డ్ కులాలు-SC, షెడ్యూల్డ్ తెగలు-ST, దారిద్య్రరేఖకు దిగువనున్న గ్రామీణ-పట్టణ ప్రాంతాలలో సబ్సిడీ గృహాలను అందించడం దీని ఉద్దేశం.

ఈ పథకానికి ఎవరు అర్హులు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అనేదానిపై ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే.. రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు, రూ.3 లక్షల నుండి రూ.6 లక్షల మధ్య సంపాదించేవారు దేశంలో ఇల్లు లేకపోతే ఈ పథకానికి అర్హులు. ఇల్లు లేకుండా 6 లక్షల నుండి 9 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రస్తుతం మురికివాడలు, పట్టణ స్థావరాలలో నివసిస్తున్నవారు ఈ పథకానికి అర్హులు. ఆర్థికంగా బలహీనమైన తక్కువ ఆదాయ వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది.


2014లో ఈ పథకం మోదీ సర్కార్ తీసుకొచ్చింది. 2015లో పట్టణ ప్రాంతాలు, 2016లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథక అమలైంది. తొలుత 2023-24 నాటికి 2.95 కోట్ల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పుడు మరో 2 కోట్ల ఇళ్లకు ఈ పథకాన్ని విస్తరించారు.

ALSO READ: యూట్యూబర్ జ్యోతి అరెస్ట్, పాక్ కు ఆర్మీ సీక్రెట్స్

ఎవరు అర్హులు? సొంతిల్లు లేని వారు, తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నవారు ఈ పథకం వర్తిస్తుంది. వారిలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మధ్య తరగతి, కార్మికులకు వర్తించనుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? https://web.umang.gov.in/landing/scheme/dashboard వెబ్ పోర్టల్‌ను చూడాల్సి వుంటుంది.  తొలుత మీ పేరును ఎంచుకుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు, సమ్మతి ఫారాన్ని నింపాలి. అలాగే బ్యాంకు ఖాతా, పథకానికి సంబంధిత వివరాలు కచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత అధికారులు వచ్చి పరిశీలన చేసిన తర్వాత ఇల్లు మంజూరు చేస్తారు. దీనికి సంబంధించి ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, పక్కా ఇల్లు లేదని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ తరగతి ప్రజలు అనర్హులు. పక్కా ఇల్లు కలిగినవారిని అంగీకరించదు. అలాగే మోటార్‌ సైకిల్, కారు, ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలు ఉన్నవారు కష్టమే. రూ. 50,000 పైబడి కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉన్నవారు కూడా. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించేవారు దీని పరిధిలోకి రారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు,ఫ్రిజ్, ల్యాండ్‌ లైన్ ఫోన్, వ్యవసాయ భూములు కలిగినవారికి వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు పైనిబంధనలు మారుతాయి. వీరికి సబ్సిడీ, లేదా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సదుపాయన్ని ప్రభుత్వం కల్పించనుంది. కేవలం ఆరునెలలు మాత్రమే గడువు ఉన్నందున దీన్ని ఉపయోగించుకోవాలి.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×