BigTV English

Realme Narzo N65 5G Mobile: రియల్‌మీ అదరకొట్టింది.. రూ.12 వేలకే 5G ఫోన్.. ఇలా చవకగా మొదటిసారి..!

Realme Narzo N65 5G Mobile: రియల్‌మీ అదరకొట్టింది.. రూ.12 వేలకే 5G ఫోన్.. ఇలా చవకగా మొదటిసారి..!

Realme Narzo N65 5G Mobile Launching May 28th with Rs 12,000 Only: టెక్ దిగ్గజ కంపెనీ Realme భారతీయ మొబైల్ ప్రియుల కోసం మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ మేరకు కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా టీజ్ చేసింది. Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. ఇది వచ్చే వారం ప్రారంభించే అవకాశం ఉంది. లాంచ్ తేదీని కూడా రియల్‌మీ ధృవీకరించింది. ఇందులో బెస్ట్ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీని చూడొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, దాని లాంచ్ తేదీ, ధర తదితరచ వివరాల గురించి తెలుసుకోండి.


రియల్‌మీ నార్జో N65 మే 28, 2024న భారతదేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరిస్తూ చైనీస్ బ్రాండ్ టీజర్‌ను షేర్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoCతో కూడిన 5G ఫోన్. అదనంగా హ్యాండ్‌సెట్ వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే వర్షం నీటితో తడిసిన తర్వాత కూడా ఫోన్ స్క్రీన్ టచ్ పని చేస్తుంది.

రియల్‌మీ గోల్డ్ వేరియంట్‌లో నార్జో ఎన్65 టీజర్‌ను పోస్ట్ చేసింది. డ్యూయల్ ఇమేజ్ సెన్సార్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ పెద్ద కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50-మెగాపిక్సెల్ షూటర్. కొత్త Narzo N65 C65 మాదిరిగానే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో కొత్త ఫోన్ Realme C65 రీబ్రాండెడ్ మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. Realme C65 5G కూడా డైమెన్సిటీ 6300తో వస్తుంది.


Also Read: ఇలాంటి ఫోన్ చూసిఉండరు.. రూ.14 వేలకే 512 GB స్టోరేజ్, 108 MP కెమెరా!

Realme Narzo N65 ఫోన్ Realme C65 రిఫ్రెష్ వెర్షన్ అయితే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో HD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. కెమెరా ముందు ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, సెకండరీ రియర్ సెన్సార్, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చు. ఇది 15W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Realme Narzo N65 ఫోన్ అధికారిక ధరను కంపెనీ నిర్ధారించలేదు. అయితే Realme Narzo N65 5Gని భారత మార్కెట్‌లో దాదాపు రూ. 12,000 ధరలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, కంపెనీ అధికారిక సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Also Read: ఇదేక్కడి ఆఫర్ భయ్యా.. రూ.354లకే స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తారంటా.. మూడు రోజులు మాత్రమే!

Tags

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×