BigTV English

AMOLED Display Phones Under Rs 15,000: కేవలం రూ.15 వేలలో అమోల్డ్ డిస్‌ప్లే ఫోన్ దొరకడం చాలా అరుదు.. ఇది మీ అదృష్టమే!

AMOLED Display Phones Under Rs 15,000: కేవలం రూ.15 వేలలో అమోల్డ్ డిస్‌ప్లే ఫోన్ దొరకడం చాలా అరుదు.. ఇది మీ అదృష్టమే!

AMOLED Display Phones Under Rs 15,000: చాలా మంది ఫోన్ ప్రియులు స్మార్ట్‌ఫోన్ కొనాలంటే అందులో వారికిష్టమైన ఏదో ఒక ఫీచర్ ఉండాల్సిందే. మంచి ఫొటోలు తీసే కెమెరా అయినా.. ఫుల్ బ్రైట్‌నెస్‌తో కనిపించే డిస్‌ప్లే అయినా.. అదీకాకపోతే అధిక ర్యామ్ + స్టోరేజ్ కలిగిన వేరియంట్ అయినా. ఇలా ఏదో ఒక స్పెషల్ ఫీచర్‌ ఉంటేనే స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటారు. వీటిలో ముఖ్యంగా వీడియోలు, ఫొటోలు చాలా అందంగా కనిపించే డిస్ ప్లే గల ఫోన్‌పై ఎక్కువ మందికి ఆసక్తి ఉంటుంది.


అందువల్లనే AMOLED ప్యానెల్‌ కలిగిన ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటారు. ఈ ప్యానల్ సాధారణంగా LCD ప్యానెల్‌ల కంటే మంచి స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. ఫోన్‌లో మంచిగా కనిపించే స్క్రీన్ కావాలంటే AMOLED ప్యానెల్‌లతో కూడిన ఫోన్‌ల కోసం వెతకాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. AMOLED స్క్రీన్‌లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు చాలా ఖరీదైనవి. అయితే బడ్జెట్ ధరలో అమోలెడ్ స్కీన్ కలిగిన ఫోన్‌ను కొనుక్కోవాలని చూసే వారికి ఓ గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ రూ.15 వేల బడ్జెట్‌లో, లోయర్-మిడ్ సెగ్మెంట్‌లో అనేక రకాల అమోలెడ్ డిస్‌ప్లే ఫోన్లను అందిస్తుంది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samsung Galaxy M15 5G


Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ Amazonలో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిని రూ.12,999 ధరతో సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,000 వరకు బ్యాంక్ తగ్గింపు కూడా పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.5-అంగుళాల SuperAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP మెయిన్ లెన్స్, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో సెటప్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే 13MP సెల్ఫీ స్నాపర్ ఉంది. డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది గరిష్టంగా 8GB RAM + 128GB అంతర్గత నిల్వను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 OSలో నడుస్తుంది.

Also Read: కిరిన్ చిప్‌సెట్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తుంది..!

Realme Narzo 70 5G

Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 15,999 ధరతో లిస్ట్ అయింది. అయితే దీనిపై రూ.2,000 కూపన్ తగ్గింపు కూడా ఉంది. ఈ కూపన్ డిస్కౌంట్‌తో రూ. 13,999కే కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP ప్రధాన లెన్స్, 2MP మాక్రో యూనిట్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 16MP సెల్ఫీ స్నాపర్ ఉంది. డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ దీనికి శక్తినిస్తుంది. ఇది గరిష్టంగా 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Android 14 OS పై నడుస్తుంది.

Tecno Camon 20 4G (ఆర్ట్ ఎడిషన్)

Tecno Camon 20 4G అమెజాన్‌లో చాలా తక్కువ ధరకే ఉంది. కేవలం రూ. 12,999లకే లభిస్తుంది. అలాగే దీనిపై రూ. 2,000 వరకు బ్యాంక్ తగ్గింపు కూడా ఇస్తున్నారు. ఇది AMOLED స్క్రీన్‌లతో వస్తుంది. 6.67-అంగుళాల FHD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఉంది. ఇది 64MP ప్రధాన లెన్స్‌ని కలిగి ఉంది. Helio G85 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. అందువల్ల రూ. 15,000 లోపు AMOLED స్క్రీన్‌లతో సరసమైన ఫోన్‌ను కొనుక్కోవాలని భావించే వారికి ఇవి బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×