BigTV English
Advertisement

Huawei Nova 13 Series: కిరిన్ చిప్‌సెట్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తుంది..!

Huawei Nova 13 Series: కిరిన్ చిప్‌సెట్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తుంది..!

Huawei Nova 13 Series Smartphone Launching Soon: ప్రముఖ టెక్ బ్రాండ్ Huawei త్వరలో Huawei Nova 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కి సంబంధించిన లీకులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ ఈ సిరీస్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్ అందించారు. ఈ ఫోన్‌లో కిరిన్ చిప్‌సెట్ అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్‌లలో కూడా ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


Huawei Nova 13 సిరీస్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మాత్రమే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుందని గతంలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు చైనా టిప్‌స్టర్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో కూడా అదే తెలిపాడు. ఈ పోస్ట్‌ ప్రకారం.. Huawei Nova 13 సిరీస్ ఆగస్టులో ప్రారంభించబడుతుందని పేర్కొన్నాడు. కాగా Huawei Nova 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో Kirin చిప్‌సెట్ అందించబడుతుందని చెప్పాడు.

Also Read: 16 జీబీ ర్యామ్, 1TB స్టోరేజ్, 11,500mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త వేరియంట్.. ఇక రచ్చ రచ్చే..!


అదే సమయంలో ఈ సిరీస్‌లోని టాప్ మోడల్‌లలో శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి ఫీచర్లు కూడా కనిపించనున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ఫీచర్‌ను Huawei Nova 13 Pro, Nova 13 Ultraలో అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌తో పాటు కంపెనీ కొత్త టాబ్లెట్‌లను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే ఈ టాబ్లెట్‌లలో కూడా కిరిన్ చిప్‌సెట్ అమర్చబడుతుందని సమాచారం. విశేషమేమిటంటే Huawei Star Flash NearLink టెక్నాలజీని ఈ టాబ్లెట్లలో అందించవచ్చని భావిస్తున్నారు.

ఈ టెక్నాలజీ కోసం ఇది బ్లూటూత్, Wi-Fi రెండింటి శక్తిని కలిపి ఉపయోగిస్తుంది. దీని సహాయంతో ప్రసార వేగం వేగవంతం అవుతుంది. దీనివల్ల ఫోన్ పవర్ తక్కువగా ఉపయోగించబడుతుంది. అదే సమయంలో కనెక్షన్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. అలాగే ఇది ఇతర కనెక్టివిటీ ఫీచర్ల కంటే సేఫ్టీ అని చెప్పబడింది. ఇక Huawei Nova 12 విషయానికొస్తే.. కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో 12 సిరీస్‌లో HarmonyOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ OLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో వచ్చింది.

Tags

Related News

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

iphones Stolen: ఒకే నగరంలో 80000 ఐఫోన్లు దొంగతనం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Big Stories

×