E-Paper
Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!
Advertisement

Truke Mega 10 Earbuds: తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. కేవలం రూ.999 ఆఫర్ ధరలోనే.. ఏకంగా 24-బిట్ స్పేషియల్ సౌండ్, 70 గంటల భారీ ప్లేటైమ్, డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లను కంపెనీ ఇందులో.. అందించింది. రాయల్ బ్లూ కలర్ మ్యాట్ ఫినిష్‌తో.. ట్రెండీగా కనిపించే ఈ ట్రూ వైర్‌ లెస్ హెడ్‌ సెట్ పనితీరు ఎలా ఉందో, దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ,ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ట్రెండీ డిజైన్, కంఫర్ట్:
ఈ మోడల్ ఇయర్‌బడ్స్ డ్యూయల్-టోన్ మ్యాట్ ఫినిష్ ఛార్జింగ్ కేస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా రాయల్ బ్లూ వేరియంట్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. చెవిలో సరిగ్గా.. ఇమిడి పోయే ఇన్-ఇయర్ డిజైన్, కేవలం 41 గ్రాముల తక్కువ బరువు వల్ల గంటల తరబడి వాడినా అసౌకర్యంగా అనిపించదు. జిమ్‌లో.. చెమట పట్టినా లేదా వర్షపు చినుకులు పడినా పాడవకుండా దీనికి IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఇచ్చారు.

Advertisement

24-బిట్ స్పేషియల్ సౌండ్, 13mm డ్రైవర్లు :
రూ.వెయ్యి లోపు ధరలో ఈ ఇయర్‌బడ్స్ అందించే.. ఆడియో క్వాలిటీ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో పెద్ద 13mm టైటానియం డ్రైవర్లు, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయి. దీని వల్ల పాటలు వినేటప్పుడు పంచీ బేస్ తో పాటు, సినిమాలు చూసేటప్పుడు.. 360-డిగ్రీల థియేటర్ రేంజ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. గేమ్స్ ఆడే కోసం ఇందులో 40ms అల్ట్రా-లో లేటెన్సీ గేమ్ మోడ్ ఉండటం వల్ల ఆడియో, వీడియో మధ్య ఎలాంటి ల్యాగ్ ఉండదు.

క్వాడ్ మైక్ ,డ్యూయల్ పెయిరింగ్ :
ఆఫీస్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ మాట్లాడే వారి కోసం ఇందులో.. టెక్నాలజీ అందించారు. ఇది బయటి ట్రాఫిక్ శబ్దాలను తగ్గించి, అవతలి వారికి మీ వాయిస్ స్పష్టంగా వినిపించేలా.. చేస్తుంది. అంతే కాకుండా, లేటెస్ట్ బ్లూటూత్ 5.4 తో పాటు డ్యూయల్ పెయిరింగ్ ఫీచర్ ఇందులో ఉంది. దీని ద్వారా మీరు ఒకే సారి మీ మొబైల్, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుని, అవసరమైనప్పుడు ఈజీగా స్విచ్ అవ్వొచ్చు.

Advertisement

70 గంటల భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ :
బ్యాటరీ విషయంలో ఈ మోడల్ తిరుగు లేని పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది మొత్తం 70 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. కేవలం బడ్స్ ఒక్క సారి పూర్తిగా.. ఛార్జ్ చేస్తే 10 గంటల పాటు నాన్‌ స్టాప్‌గా పని చేస్తాయి. టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 150 నిమిషాల (2.5 గంటలు) ప్లేటైమ్ లభిస్తుంది. టచ్ కంట్రోల్స్ ,వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.

ధర వివరాలు:
ఈ మోడల్ ఇయర్‌బడ్స్ రాయల్ బ్లూ, జెట్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. వీటి అసలు రూ.4,499 కాగా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ట్రూక్ అధికారిక వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్‌తో ..ప్రస్తుతం రూ.999 నుంచి రూ. 1,199 మధ్యలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దీనికి 1 సంవత్సరం వారంటీ ఇస్తోంది.

మీ బడ్జెట్ రూ.1,000 లోపు ఉండి, డ్యూయల్ పెయిరింగ్, 24-బిట్ స్పేషియల్ సౌండ్, 70 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్, గేమింగ్ మోడ్ ఉన్న ఆల్-రౌండర్ TWS ఇయర్‌ బడ్స్ కావాలనుకుంటే.. ఈ మోడల్ ఒక బెస్ట్ వాల్యూ-ఫర్-మనీ ఆప్షన్.

Related News

రూ.759కే 80 గంటల ప్లేటైమ్, ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ ఇయర్ బడ్స్

వాట్సప్‌లో జస్ట్ Hi అని మెసేజ్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు!

కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా ?దీనిపై ఓ లుక్కేయండి

మారుమూల గ్రామాలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్.. సామాన్యుల జీవితాలను మార్చబోతున్న శాటిలైట్ నెట్‌వర్క్ విశేషాలివే!

ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. కానీ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా స్మార్ట్ గ్లాసెస్.. ఏఐ ఫీచర్లతో మన జీవితాన్ని ఇవి ఎలా మార్చబోతున్నాయంటే!

కరెన్సీ నోటుకు డిజిటల్ రూపం.. అసలు ఈ e₹ ఎలా పనిచేస్తుంది? UPI కంటే ఇది ఎందుకు భిన్నం?

Big Stories

Advertisement
×