E-Paper
Advertisement

వాట్సప్‌లో జస్ట్ Hi అని మెసేజ్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు!

వాట్సప్‌లో జస్ట్ Hi అని మెసేజ్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు!
Advertisement

EPFO WhatsApp Service: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ (EPFO) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగే పని అంతకన్నా లేదు. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో వాట్సప్ ఉంటే చాలు.. కేవలం ఒక్క Hi మెసేజ్‌తో మీ పీఎఫ్ బ్యాలెన్స్, లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలను నేరుగా ఫోన్‌లోనే చూసుకోవచ్చు. ఉద్యోగుల సమయాన్ని ఆదా చేసేలా ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చిన ఈ సదుపాయానికి ఇప్పటికే భారీ స్పందన వస్తోంది. ఈ సేవ అందుబాటులోకి వచ్చిన కేవలం 14 రోజుల్లోనే దాదాపు 90 లక్షల మంది తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారు. ఇంతకీ ఈ వాట్సప్ సేవను ఎలా ఉపయోగించుకోవాలి? ఏ నంబర్‌కు మెసేజ్ పంపాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వాట్సప్‌లో సేవలు ఎలా పొందాలి?

ఈ సదుపాయాన్ని వాడుకోవడం చాలా సులభం. ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించిన 8796441800 అనే నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు Hi అని మెసేజ్ పంపండి. అయితే ఒక చిన్న కండిషన్ ఉంది. మీరు మెసేజ్ చేసే మొబైల్ నంబర్ కచ్చితంగా మీ యూఏఎన్ (UAN) నంబర్‌తో లింక్ అయి ఉండాలి. మెసేజ్ పంపిన తర్వాత చిన్న వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే ఆప్షన్లలో మీకు కావాల్సిన సేవను ఎంచుకోవచ్చు.

ఏమేం వివరాలు తెలుసుకోవచ్చు?

Advertisement

ఈ వాట్సప్ చాట్‌బాట్ ద్వారా కేవలం బ్యాలెన్స్ మాత్రమే కాదు.. మరిన్ని ముఖ్యమైన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఖాతాలో ప్రస్తుతం ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడంతో పాటు, చివరి ఐదు ట్రాన్సాక్షన్ల వివరాలను కూడా వెంటనే చూసుకోవచ్చు. అంతేకాకుండా.. మీ పీఎఫ్ పాస్‌బుక్‌ను కూడా నేరుగా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Also Read: మారుమూల గ్రామాలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్.. సామాన్యుల జీవితాలను మార్చబోతున్న శాటిలైట్ నెట్‌వర్క్ విశేషాలివే!

విత్‌డ్రా నిబంధనల్లో కొత్త మార్పులు:

Advertisement

మరోవైపు పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలను కూడా ఈపీఎఫ్‌ఓ మరింత సులభతరం చేసింది. రిటైర్ అయ్యే ఉద్యోగులు తమ పూర్తి డబ్బును ఒకేసారి కాకుండా.. విడతల వారీగా తీసుకునేందుకు ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’ తీసుకొచ్చింది. అంతేకాకుండా, 55 ఏళ్ల లోపు ఉన్న సభ్యులు తమ అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో 90 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం 75 శాతం మాత్రమే ఉండేది. నిరుద్యోగ సమయంలో డబ్బు తీసుకునే వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తగ్గించారు.

ఏయే అవసరాలకు తీసుకోవచ్చు?

అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలిచేలా ఈ నిధులను వాడుకోవచ్చు. కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల అవసరాల కోసం పీఎఫ్ డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు సొంత ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడానికి, స్థలం కొనడానికి, అలాగే హోమ్ లోన్ తీర్చడానికి కూడా ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త డిజిటల్ మార్పులు కోట్లాది మంది ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తున్నాయి.

Also Read: స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా స్మార్ట్ గ్లాసెస్.. ఏఐ ఫీచర్లతో మన జీవితాన్ని ఇవి ఎలా మార్చబోతున్నాయంటే!

Tags

Related News

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

రూ.759కే 80 గంటల ప్లేటైమ్, ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ ఇయర్ బడ్స్

కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా ?దీనిపై ఓ లుక్కేయండి

మారుమూల గ్రామాలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్.. సామాన్యుల జీవితాలను మార్చబోతున్న శాటిలైట్ నెట్‌వర్క్ విశేషాలివే!

ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. కానీ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా స్మార్ట్ గ్లాసెస్.. ఏఐ ఫీచర్లతో మన జీవితాన్ని ఇవి ఎలా మార్చబోతున్నాయంటే!

కరెన్సీ నోటుకు డిజిటల్ రూపం.. అసలు ఈ e₹ ఎలా పనిచేస్తుంది? UPI కంటే ఇది ఎందుకు భిన్నం?

Big Stories

Advertisement
×