Jio 450 Recharge Plan: జియో యూజర్లకు ఉపయోగపడే మరో రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. కేవలం కాల్స్, డేటా మాత్రమే కాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, డిజైనింగ్ యాప్ ప్రయోజనాలు కూడా ఇందులో లభిస్తున్నాయి. రూ.450 ధరతో వచ్చే ఈ ప్లాన్‌లో 36 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్ పొందొచ్చు. వీటితో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 12 నెలల కాన్వ ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి..
జియో రూ.450 రీఛార్జ్ ప్లాన్ మొత్తం 36 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో యూజర్లకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 36 రోజులకు కలిపి మొత్తం 72GB డేటాను వాడుకోవచ్చు. ఒకవేళ రోజువారీ 2GB డేటా అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకు తగ్గుతుంది. ఇక కాలింగ్ విషయానికొస్తే.. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు కూడా ఉచితంగా వస్తాయి.
ఈ ప్లాన్‌లో ఉన్న మరో పెద్ద ఆకర్షణ జియో హాట్‌స్టార్ (JioHotstar) మొబైల్ సబ్‌స్క్రిప్షన్. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఈ సర్వీస్ నిరంతరాయంగా కొనసాగాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది. మీ ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన 48 గంటల్లోపు మళ్లీ అర్హత ఉన్న రీఛార్జ్ ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రీఛార్జ్ చేసిన జియో నంబర్‌తోనే యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
డిజైనింగ్ చేసేవారికి, కంటెంట్ క్రియేటర్లకు ఈ ప్లాన్ ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇందులో సుమారు రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్ 12 నెలల పాటు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. కాన్వాలో ఉండే రకరకాల టెంప్లేట్స్ సాయంతో ఎవరైనా సులభంగా పోస్టర్లు, వీడియోలు డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఈ కాన్వా ప్రో లైట్, హాట్‌స్టార్, గూగుల్ జెమిని ప్రో ప్రయోజనాలు ఏడాది పాటు ఆగకుండా కొనసాగాలంటే, యూజర్లు కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉండాలి.
మన ఫోన్‌లో స్టోరేజ్ నిండిపోయినప్పుడు ఫొటోలు, ముఖ్యమైన ఫైల్స్ దాచుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం. ఆ సమస్యకు చెక్ పెడుతూ ఈ ప్లాన్‌లో 50GB ఉచిత జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) స్టోరేజ్‌ను అందిస్తున్నారు. రీఛార్జ్ చేసిన జియో నంబర్‌తో లాగిన్ అయి మీ ముఖ్యమైన డిజిటల్ ఫైల్స్‌ను ఇందులో సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. తక్కువ ధరలో ఇన్ని బెనిఫిట్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: కరెన్సీ నోటుకు డిజిటల్ రూపం.. అసలు ఈ e₹ ఎలా పనిచేస్తుంది? UPI కంటే ఇది ఎందుకు భిన్నం?