Samsung Galaxy Tab S12 Ultra review: ట్యాబ్ మార్కెట్లో ప్రీమియం.. ఫీల్ కోరుకునే వారి కోసం శాంసంగ్ తీసుకొచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఇది..ఈ మోడల్ ఇంచుల భారీ.. అమోలెడ్ డిస్‌ప్లే, బాక్స్‌లోనే.. వచ్చే S Pen, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో.. ఇది అచ్చం ల్యాప్‌టాప్ లాంటి ఫీల్ ఇస్తుంది. అయితే.. దీని ఫీచర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ధర కూడా.. అంతే భారీగా ఉంది. అసలు ఈ ట్యాబ్ ఎవరికి సెట్ అవుతుంది? దీని పూర్తి రివ్యూ, ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మోడల్ చూడగానే ప్రీమియం లుక్‌తో.. ఆకట్టుకుంటుంది. కేవలం 5.1mm మందంతో అత్యంత సన్నగా తయారు చేసిన ఈ.. ట్యాబ్, సుమారు 695 ..గ్రాముల బరువు ఉంటుంది. దీని స్క్రీన్ సైజు పెద్దది కావడంతో.. చేతిలో.. పట్టుకుని ఎక్కువ సేపు.. వాడటం కాస్త ..భారంగా అనిపించొచ్చు కానీ, డెస్క్ మీద పెట్టుకుని పని చేయడానికి.. చాలా బాగుంటుంది. గ్రే ,సిల్వర్ రంగుల్లో లభించే.. ఈ డివైజ్‌కు IP68 డస్ట్ ,వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్.
ఈ ట్యాబ్ మెయిన్ అట్రాక్షన్. దీని 14.6-ఇంచుల డిస్‌ప్లే. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో.. సినిమాలు చూడాలన్నా.. ఫోటో/వీడియో ఎడిటింగ్ చేయాలన్నా.. విజువల్స్ చాలా షార్ప్‌గా, కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. ఒకే సారి మూడు యాప్స్‌ను స్ప్లిట్-స్క్రీన్‌లో ఓపెన్ చేసి మల్టీటాస్కింగ్ చేయడం ఇందులో చాలా ఈజీ. దీనికి తోడు ఇందులోని బెస్ట్ స్పీకర్లు థియేటర్.. రేంజ్ సౌండ్ ఫీల్ అందిస్తాయి.
పనితీరు విషయంలో శాంసంగ్ ఎక్కడా.. రాజీ పడ లేదు. ఇందులో.. 3nm టెక్నాలజీపై రూపొందిన బెస్ట్ ప్రాసెసర్, 12GB రామ్ అందించారు. హెవీ గేమింగ్, వీడియో రెండరింగ్ లేదా ఆఫీస్ వర్క్ ఏదైనా సరే.. ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పూర్తవుతుంది. ఇది లేటెస్ట్ Android 17 ఆధారిత One UI 9 పై పని చేస్తుంది. పైగా శాంసంగ్ దీనికి ఏకంగా 7 ఏళ్ల పాటు OS,సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తామని ప్రకటించడం విశేషం.
క్రియేటర్స్, విద్యార్థులకు బాగా నచ్చే S Pen బాక్స్‌లోనే ఉచితంగా వస్తుంది. నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్ వేయడానికి దీని పామ్ రిజెక్షన్ చాలా ఖచ్చితంగా పని చేస్తుంది.
వెనకవైపు 13MP మెయిన్ + 8MP అల్ట్రావైడ్ కెమెరాలు, ముందు వైపు వీడియో కాల్స్ కోసం 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. డాక్యుమెంట్ స్కానింగ్, ఆన్‌లైన్ మీటింగ్స్‌కు ఇవి సరి పోతాయి.
Also Read: వీటితో టైల్స్,కార్పెట్స్.. ఏవైనా తళతళా మెరవాల్సిందే!
ఇందులో 11,600mAh భారీ బ్యాటరీ ఉంది. సాధారణ వాడకంలో.. సుమారు 10 నుంచి 11 గంటల స్క్రీన్-ఆన్ టైమ్ వస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వకపోవడం కాస్త నిరాశపరిచే విషయం.
ధర:
ఈ ట్యాబ్ ధర ప్రస్తుతం .1,34,999గా ఉంది.
మీరు ప్రొఫెషనల్ డిజైనర్, కంటెంట్ క్రియేటర్ లేదా ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా ఒక పవర్ ఫుల్ పెద్ద స్క్రీన్ ట్యాబ్ కావాలనుకుంటే ఈ మోడల్ బెస్ట్ ఛాయిస్. అయితే కేవలం సినిమాలు చూడటానికి లేదా సాధారణ బ్రౌజింగ్ కోసం ఇంత భారీ ధర పెట్టడం అనవసరం.