boAt Wave Call 3 smartwatch: తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. పెద్ద 1.83-అంగుళాల హెచ్డీ డిస్‌ప్లే, ఆకట్టుకునే యానిమేటెడ్ వాచ్ ఫేసెస్, అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో.. ఇది యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. కేవలం టైమ్ చూడటానికే కాకుండా, రోజువారీ హెల్త్ , ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు కూడా ఇది ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ స్మార్ట్‌వాచ్ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మోడల్ స్మార్ట్‌వాచ్ 1.83-ఇంచుల (4.64 cm) పెద్ద హెచ్డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు కూడా స్క్రీన్‌పై నోటిఫికేషన్లు, టైమ్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చేతిని పైకి.. ఎత్తగానే స్క్రీన్ ఆన్ అయ్యే ‘Raise to Wake’ ఫీచర్ ఇందులో ఉంది. దీనికి ఉన్న ఫంక్షనల్ క్రౌన్ తిప్పడం ద్వారా మెనూలను, వాచ్ ఫేసెస్‌ను చాలా ఈజీగీ మార్చుకోవచ్చు. అలాగే..మీ మూడ్‌కు తగ్గట్టుగా మార్చుకోవడానికి ఇందులో ..అనేక యానిమేటెడ్ వాచ్ ఫేసెస్, క్లౌడ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. కేవలం 20 గ్రాముల బరువుతో రోజంతా చేతికి పెట్టుకున్నా చాలా తేలికగా ఉంటుంది.
ఈ వాచ్‌లో అత్యంత ఉపయోగ కరమైన ఫీచర్ బ్లూటూత్ కాలింగ్. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పాటు ఇన్‌బిల్ట్ మైక్రో ఫోన్, స్పీకర్, డయల్ ప్యాడ్ అందించారు. మీరు డ్రైవింగ్‌లో.. ఉన్నా లేదా వర్కౌట్ చేస్తున్నా జేబులో.. నుంచి ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా నేరుగా వాచ్ నుండే కాల్స్ మాట్లాడొచ్చు. మీ ముఖ్యమైన కాంటాక్ట్స్‌ను వాచ్‌లోనే సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం ఇందులో.. 24×7 హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ , స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మెన్స్ట్రువల్ ట్రాకర్ కూడా అందించారు. రన్నింగ్, సైక్లింగ్, యోగా, క్రికెట్ వంటి అనేక స్పోర్ట్స్ మోడ్స్ ద్వారా మీరు ఖర్చు చేసిన క్యాలరీలు, నడిచిన అడుగులను కచ్చితంగా లెక్కించుకోవచ్చు.
జిమ్‌లో చెమట పట్టినా లేదా వర్షంలో.. తడిసినా పాడవకుండా ఈ వాచ్‌కు IP68 డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో 300mAh బ్యాటరీ ఉంది. ఒక సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే (సుమారు 2 గంటలు పడుతుంది) సాధారణ వాడకంలో 5 నుంచి 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే.. సుమారు 2 నుంచి 3 రోజుల వరకు వస్తుంది. ఇందులో మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షట్టర్ కంట్రోల్, అలారం, వెదర్ అప్‌డేట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. కానీ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ మోడల్ స్మార్ట్ వాచ్ బోల్డ్ బ్లాక్ , మెటాలిక్ బ్లాక్ , టింబర్ బ్రౌన్, ఆక్వా బ్లూ, స్ప్రింగ్ బ్లాసమ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
ఇండియన్ మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.1,099 నుంచి రూ. 1,399 మధ్యలో ఉంది. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆఫర్లను బట్టి మెటాలిక్ వేరియంట్ ధర రూ.1,599 వరకు ఉండొచ్చు). కంపెనీ దీనికి 1 సంవత్సరం వారంటీని అందిస్తోంది.
మీ బడ్జెట్ రూ.1,500 లోపు ఉండి, పెద్ద హెచ్డీ స్క్రీన్, యానిమేటెడ్ వాచ్ ఫేసెస్, స్పష్టమైన బ్లూటూత్ కాలింగ్, IP68 వాటర్ ప్రొటెక్షన్ ఉన్న బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కావాలనుకుంటే.. ఈ మోడల్ ఒక బెస్ట్ వాల్యూ-ఫర్-మనీ డీల్.