Snapchat Memories| స్నాప్‌చాట్ తన ఫేమస్ మెమోరీస్ ఫీచర్‌ను మార్చింది. ఈ పాపులర్ యాప్ అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్‌ను ఆపేస్తోంది. గత 10 సంవత్సరాలుగా ఈ ఫీచర్ యాప్ లో ఉచితంగా ఉంది. కానీ ఇప్పుడు యూజర్లు తమ పాత ఫోటోలు, వీడియోలను సేవ్ చేయడానికి డబ్బు చెల్లించాలి. స్నాప్‌చాట్ యూజర్లకు కొంతవరకు కంటెంట్‌ను ఉచితంగా స్టోర్ చేసుకునే వెసులబాటు ఇప్పటికీ కల్పిస్తోంది. కానీ ఈ ఫ్రీ స్టోరేజ్‌కు లిమిట్ ఉంటుంది.
కంపెనీ కొత్త మెమోరీ స్టోరేజ్ ప్లాన్‌లను ప్రకటించింది. ప్రతి యూజర్‌కు 5జీబీ ఫ్రీ స్టోరేజ్ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ప్లాన్‌కు బదులు ఇప్పుడు కొత్తగా స్నాప్‌చాట్ ఈ ప్లాన్ తీసుకువస్తోంది. 5జీబీ కంటే ఎక్కువ కంటెంట్ స్టోర్ చేయాలంటే పెయిడ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేయాలి. iCloud, గూగుల్ డ్రైవ్‌లా ఇది పనిచేస్తుంది.
స్నాప్‌చాట్ మూడు ప్లాన్‌లను విడుదల చేసింది. మొదటి ప్లాన్ 100జీబీ స్టోరేజ్. ధర $1.99 (సుమారు ₹165) నెలకు. 256జీబీ ప్లాన్ $3.99 (సుమారు ₹330) నెలకు. తరచుగా యూజ్ చేసేవారికి 5టీబీ ప్లాన్ ఉంది. ధరలు ప్రాంతాలవారీగా మారవచ్చు. ప్లాన్‌లు ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ అవుతున్నాయి.
స్నాప్‌చాట్ కొత్త మెమొరీస్‌ను టెంపరరీ స్టోరేజ్‌లో ఉంచుతుంది. యూజర్లకు 12 నెలల ఫ్రీ టెంపరరీ స్టోరేజ్ ఇస్తుంది. ఒక సంవత్సరం తర్వాత ప్లాన్ అప్‌గ్రేడ్ చేయకపోతే కంటెంట్ డిలీట్ అవుతుంది. మెమోమరీస్‌ను మీ డివైస్ కు డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా పెయిడ్ ప్లాన్ తీసుకోవాలి.
స్నాప్‌చాట్ యూజర్లకు మెమరీస్ డౌన్‌లోడ్ చేయమని సూచిస్తోంది. ఇమేజ్ లేదా వీడియోను ప్రివ్యూ చేసి ఫోన్‌కు సేవ్ చేయండి. అక్కడ నుండి మరో క్లౌడ్ సర్వీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. డేటా డిలీట్ కాకుండా ఇది సహాయపడుతుంది. ఫ్రీ నుండి పెయిడ్‌కు మారడం కష్టమని స్నాప్ చాట్ అంగీకరిస్తోంది. కానీ స్టోరేజ్ ఉచితంగా అందించడం కూడా కష్టమని చెప్పింది.
ఈ నిర్ణయం చాలా మంది లాంగ్-టైమ్ యూజర్లకు కోపం తెప్పించింది. సంవత్సరాల తరబడి మెమోరీస్ యాప్‌లో సేవ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా మెమొరీస్ కోసం డబ్బులు చెల్లించాలి లేదా డిలీట్ చేస్తామంటే ఇది బ్లాక్ మెయిల్ లాగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే పెయిడ్ మెమొరీస్ ఫీచర్ తీసుకుంటే చాలా లాభాలుంటాయని చెబుతోంది.
Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి