సౌత్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన శారీ స్టోర్లలో ఒకటైన ముగ్ధా.. కూకట్ పల్లి షో రూమ్ ను ‘ముగ్ధా 2.0’ పేరుతో పున: ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ ‘ఓజీ’ బ్యూటీ, ప్రముఖ నటి ప్రియాంక మోహన్, ముగ్ధా వ్యవస్థాపకురాలు శశి వంగపల్లితో కలిసి ఈ స్టోర్ ను ఓపెన్ చేశారు. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ స్టోర్ లో కస్టమర్లకు ప్రత్యేక షాపింగ్ అనుభవాన్ని అందించేలా ఈ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. శారీ మార్కెట్ ను శాసించడమే లక్ష్యంగా ముగ్ధా 2.0 ఓపెన్ అయ్యింది. ఈ స్టోర్ అసాధారణమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండింగ్ చీరలు, ప్రత్యేకమైన చేనేత చీరలనుతో పాటు అన్నిరకాల శారీస్, అత్యంత సరసమైన ధరల్లో లభిస్తున్నట్లు నటి ప్రియాంక మోహన్ వెల్లడించారు.
ఇక ముగ్ధా 2.0 స్టోర్ గురించి ముగ్ధా వ్యవస్థాపకురాలు, చీఫ్ డిజైనర్ శశి వంగపల్లి కీలక విషయాలు వెల్లడించారు. కస్టమర్లకు నమ్మకం, నాణ్యతతో కూడిన చీరలను అందిస్తున్నట్లు వెల్లడించారు. “ముగ్ధా ఎల్లప్పుడూ నమ్మకం, నాణ్యతతో పాటు అద్భుతమైన చీరలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది. ముగ్ధా 2.0తో ఆధునిక, స్టైలిష్ తో పాటు సంప్రదాయ చీరలతో షాపింగ్ అనుభవాన్ని మరింత అద్భుతంగా మార్చబోతున్నాం. కూకట్ పల్లి స్టోర్ వినియోగదారులకు నచ్చే ఎన్నో డిజైన్ శారీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ పునఃప్రారంభం తర్వాత కస్టమర్లు మరిన్ని చీరలను పొందే అవకాశం ఉంటుంది” అని వెల్లడించారు.
ఇక ముగ్ధ 2.0 స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్లకు క్రేజీ ఆఫర్ అందిస్తోంది ముగ్ధా యాజమాన్యం. ప్రతి రూ. 50 వేల కొనుగోలుపై రూ. 10 వేల విలువైన ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లకు ఎంతో ఇష్టమైన ముగ్ధా ఇప్పుడు మరిన్ని బ్రాండ్లతో ఆకట్టుకోబోతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ముగ్ధా 2.0 వెర్షన్ లో కస్టమర్లను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలిపింది. తమ బ్రాండ్ వారసత్వాన్ని కొనసాగిస్తూనే కొత్త బ్రాండ్లను పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. ముగ్ధా 2.0 కూకట్ పల్లి కొత్త ప్రయాణంలో భాగం కావాలని శారీ లవర్స్ అందరినీ ముగ్ధా యాజమాన్యం సాదరంగా ఆహ్వానిస్తోందని వెల్లడించింది. సో, ఇంకెందుకు ఆలస్యం, మీకూ నచ్చిన చీరలను తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే కూకట్ పల్లిలోని ముగ్ధ 2.0 స్టోర్ కు వెళ్లండి. వీలుంటే రూ. 50 వేల కొనుగోళ్లపై రూ. 10 వేల ఆఫర్ పట్టేయండి!
Read Also:యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!