Bigg Boss 9 : బిగ్ బాస్ రియాలిటీ షో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. రోజులు మారుతున్న కొద్దీ ఒక్కొక్క హౌస్ మేట్ రంగులు కూడా బయటపడ్డాయి మొత్తానికి బిగ్ బాస్ నాలుగో వారంలోకి చేరుకుంది. ప్రతివారం ఎలిమినేట్ ఒకరు అవుతారు అన్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సంజన ఎలిమినేట్ అయిపోయినట్లు చూపిస్తూ సీక్రెట్ రూంలో ఉంచి మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించారు. ఇలాంటి ట్విస్టులు కూడా ఈ సీజన్లో ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు జరిగిన కొన్ని సీజన్స్ విషయంలో షో మీ ద ఆసక్తి పెరగడానికి కొన్ని ఎపిసోడ్ల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈ సీజన్ మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచే చదరంగం కాదు రణరంగం అన్నట్లే డిజైన్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ మరియు సెలబ్రిటీస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే మొదటివారం సెలబ్రిటీల్లో ఒకరైన సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి కూడా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవ్వడం మొదలుపెట్టారు. ఇక నేడు కూడా హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తుంది.
మాస్క్ మెన్ గా పేరుపొందిన హరిత హరీష్ తనదైన గేమ్ కొంతమేరకు హౌస్ లో ఆడాడు. కానీ కొన్ని విషయాల్లో అన్నీ నాకే తెలుసు నేనే కరెక్ట్ అని అనుకోవటం వలన ఆడియన్స్ కూడా తనను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హరీష్ గేమ్ చూస్తున్న చాలామంది ఆడియన్స్ కి అతని గురించి అర్థం అయిపోయింది. అందుకే కొన్ని రోజులు లేట్ అయినా కూడా నాలుగో వారంలో ఆయనను బయటకు పంపించేశారు.
సెలబ్రిటీలు కామనర్స్ మధ్య జరుగుతున్న ఈ గేమ్ లో ఇప్పటికే ముగ్గురు కామనర్స్ బయటకు వెళ్లిపోయారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా సెలబ్రిటీసే ఈ ట్రోఫీను గెలిచే ప్లానింగ్ లో ఉన్నారు అని అర్థం అయిపోతుంది.
ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు సాధించుకున్న కంటెస్టెంట్ అంటే ఇమ్మానుయేల్ అని చెప్పాలి. ఒకవైపు ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు హౌస్ లో టాస్కులు పూర్తిచేస్తూ గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు.
సుమన్ శెట్టి కి కూడా కొంతవరకు మంచి పేరు ఉండేది. బయట కూడా ఆయనకి సపోర్ట్ ఎక్కువగా ఉంది. అయితే సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే టైంలో స్మోకింగ్ క్విట్ చేయాలి అని నాగార్జున అడిగినప్పుడు నా వల్ల కాదు అని సుమన్ శెట్టి చెప్పాడు. అక్కడనుంచి కొంతమంది వీక్షకులకు ఆయన మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది అనేది వాస్తవం.
Also Read: Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు