BigTV English

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Rajnath Singh: పాకిస్థాన్.. ఛీ..ఈ పేరు పలికేందుకు కూడా నోరు రావడం లేదు. ఇది దేశం కాదు..ఉగ్రవాదుల స్థావరం. తమ దేశాభివృద్ధి మీద అక్కడి నేతలకు సోయి ఉండదు  కానీ..టెర్రరిస్టులను తయారు చేయడంలో మాత్రం ఫుల్ ఫోకస్‌ పెడతారు. అందుకే అంటారు. అది పాకిస్థాన్ అని. భారత్‌ నుంచి విడిపోయినప్పటి నుంచి.. మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్..అనేక చావు దెబ్బలు తిన్నా బుద్ది మాత్రం మారడం లేదు. ఇటీవల ఆపరేషన్ సింధూర్‌తో సాలిడ్‌ సమాధానం ఇచ్చినా.. సర్‌ క్రీక్‌ అంశంలో మరోసారి ఇండియాపై అచ్చోసిన ఆంబోతులా రంకెలేస్తోంది.


తోకజాడిస్తున్న పాకిస్థాన్
కయ్యానికి కాలుదువ్వుతున్న ఉగ్రదేశం
భారత్‌ను టచ్‌ చేస్తే చుక్కలే..
తాటతీస్తామంటూ రాజ్‌నాథ్‌ వార్నింగ్

భారత్‌తో సరిహద్దు అంశంలో గొడవ


అభివృద్ధి మీద సోయిలేదు..ప్రజా సంక్షేమం మీద ధ్యాస లేదు. కానీ భారత్‌తో మాత్రం కయ్యానికి కాలు దువ్వడంలో మాత్రం పాకిస్థాన్‌ ఎల్లప్పుడు ముందుంటుంది. ఇటీవల పహల్గాం దాడి తర్వాత భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సింధూర్‌తో చావు దెబ్బతిన్న దాయాది..మరోసారి భారత్‌తో సరిహద్దు అంశంలో గొడవకు దిగుతోంది. గుజరాత్‌లోని సరిహద్దు సర్ క్రీక్ దగ్గర కవ్వించే ప్రయత్నం చేస్తోంది.

పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ మాస్ వార్నింగ్

వాయిస్-గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్రతీరపు ఉప్పునీటి కాలువ సర్ క్రీక్.. ఇరు దేశాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్‌ మిలిటరీ జోన్లను విస్తరిస్తోంది. అలాగే జమ్మూకాశ్మీర్ సరిహద్దు వెంబడి చొరబాట్లకు ఉగ్రవాదులను లాంచ్ ప్యాడ్‌లలో సిద్ధంగా ఉంచింది. ఈ నేపథ్యంలో అమెరికా అండతో భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్‌ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్థాన్

భారత్‌ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్థాన్.. అయినా నిత్యం దూకుడుగా  వ్యవహరిస్తుండటంతో.. ఆ దేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్‌లో చొరబాటులాంటి ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా.. ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా  వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌ ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజనాథ్‌ పేర్కొన్నారు.

ఆపరేషన్‌ సింధూర్‌ 2.0లో సంయమనం అనే మాట వినపడదన్నారు

వాయిస్-అటు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ కూడా పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పాక్ దేశ ఎజెండాగా ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే.. ఈసారి తాము సంయమనం పాటించేది లేదని తేల్చిచెప్పారు. మ్యాప్ నుంచి పాకిస్థాన్‌ను తుడిచేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్దిచెప్పామని..కొంత సంయమనం కూడా పాటించామన్నారు. అయితే సర్‌ క్రీక్‌ అంశంలో త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0 ఉంటుందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2.0లో సంయమనం అనే మాట వినపడదన్నారు.

ఇదే జరిగితే.. పాక్‌కు చుక్కలు కనిపించడం ఖాయమే

సర్‌ క్రీక్‌ సరిహద్దు దగ్గర పాక్‌ కవ్వింపు చర్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, ఆర్మీ చీఫ్ ద్వివేది పాకిస్థాన్‌ను గట్టిగానే హెచ్చరిస్తుండటంతో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండే అవకాశాలకు మరింత బలం చేకూరుతోంది. ఇదే జరిగితే.. పాక్‌కు చుక్కలు కనిపించడం ఖాయమే.

అసలు ఈ సర్‌ క్రీక్ అంటే ఏంటి..?

ఆఫ్ట్రాల్ పాకిస్థాన్.. ఆకాశమంతా భారత్‌ ఉంటే.. అది అనువంత. ఆ దేశానికే స్వాతంత్య్ర బిక్ష పెట్టింది కూడా మనమే. అయినా భారత్‌పై ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంది. మనల్ని కవ్విస్తూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఇప్పటికీ ఆ దేశంతో భారత్‌కు అనే వివాదాలున్నాయి. ఇందులో గుజరాత్‌లోని సర్‌ క్రీక్‌ అనేది అతి ముఖ్యమైన వివాదాల్లో ఒకటి. అసలు ఈ సర్‌ క్రీక్ అంటే ఏంటి..? అది ఎందుకంత కీలకం..! దాని ప్రాముఖ్యత ఏంటి..?

సర్ క్రీక్ దగ్గర టెర్రరిస్థాన్ కోతి చేష్టలు

పాకిస్థాన్‌కు ముందుంది మొసళ్ల పండగ. ఆపరేషన్ సింధూర్‌తో ఆ దేశాన్ని చీల్చి చెండాడిన భారత్.. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ సింధూర్ 2.0తో పాకిస్థాన్‌ తోలు తీసేందుకు సిద్దమవుతోంది. పెహల్గాం దాడితో ఆపరేషన్ సింధూర్‌ను భారత సైన్యం నిర్వహించగా.. ఇప్పుడు సర్‌ క్రీక్‌ దగ్గర టెర్రరిస్థాన్ చేస్తున్న కోతి చేష్టలతో ఆపరేషన్ సింధూర్‌ 2.0ను నిర్వహించే అవకాశాలున్నాయి.

1968లో ట్రిబ్యునల్ అవార్డ్ తీర్పు స్పష్టంగా వెల్లడించింది.

గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్రతీరపు ఉప్పునీటి కాలువనే సర్ క్రీక్ అని పిలుస్తారు. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఈ ప్రాంతంలోకి అరేబియా సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన వివాదాల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో రెండు దేశాల సరిహద్దులపై 1968లో ట్రిబ్యునల్ అవార్డ్ తీర్పు స్పష్టంగా వెల్లడించింది.

1968 రాణ్ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యకు పరిష్కారం

1947 స్వాతంత్ర్యం తర్వాత సింధ్ పాకిస్తాన్‌లో భాగం కాగా, గుజరాత్ భారత్‌లో ఉంది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్.. రాణ్‌ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్ క్రీక్‌పై అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ వివాదం పరిష్కారం కాలేదు. మొత్తం సర్ క్రీక్ సింధ్ ప్రాంతానికి చెందినదే అని పాకిస్తాన్ వాదిస్తోంది. 1914 తీర్మానం ఈ సరిహద్దును తూర్పు ఒడ్డున ఉంచిందని..దీని ప్రకారం ఈ మొత్తం ఈ చిత్తడి నేలలు తమకే చెందుతుందని పాక్ వాదన. అయితే భారత్ మాత్రం 1914 బ్రిటీష్ అధికారులు ఈ ఒప్పందంలో థాల్వెగ్ సూత్రాన్ని వర్తింప చేసిందని ప్రస్తావిస్తోంది. దీని అర్థం క్రీక్‌లోని కాలువ మార్గంలో లోతైన ప్రాంతం నుంచి సరిహద్దును గీయాల్సి ఉంటుందని చెబుతోంది. అయితే ఈ సూత్రాన్ని వర్తింపచేయడానికి ఇక్కడ నది లేదని పాకిస్తాన్ వాదిస్తోది. కానీ 1925 నాటి బ్రిటీష్ మ్యాప్‌లో సరిహద్దు రాళ్లు నీటి మధ్యలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వేదిక

రెండు దేశాల సరిహద్దులో ఉన్న సర్ క్రీక్ .. భారత్, పాక్‌కు వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు ముఖ్య వేదిక అవుతుంది. సర్ క్రీక్ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తే ఆ దేశానికి యుద్ధ సమయంలో ఇది చాలా కీలకం అవనుంది. కరాచీకి అతిచేరువలో ఉండే సర్‌క్రీక్‌పై భారత్‌ పట్టుసాధిస్తే.. పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం తప్పదు. ఇక వేళ పాకిస్థాన్‌ ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటే.. భారత్‌కు కీలకమైన గుజరాత్, ముంబై ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. దీంతో యుద్ధ సమయంలో ఇది ఆ దేశానికి ప్లస్ అవనుంది. తమ యుద్ధనౌకలను గుజరాత్ తీరానికి సమీపంలో ఉంచడానికి.. తద్వారా తమ భద్రతను పెంచుకోవడానికి పాక్‌కు ఉపయోగపడుతుంది. అందుకే ఈ సరిహద్దు దగ్గర పాకిస్థాన్‌ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తోంది. సర్ క్రీక్ ప్రాంతం కేవలం సైనికపరంగానే కాకుండా.. ఆర్థికంగా, భద్రతాపరంగా కూడా రెండు దేశాలకు కీలకంగా నిలుస్తోంది.

పాక్ వితండవాదాలు, అబద్ధపు వాదనలు

ఎన్నాళ్ల నుంచో వివాదంగా ఉన్న ఈ సర్‌ క్రీక్‌ సరిహద్దుపై చర్చలకు భారత్‌ ముందుకొస్తున్నా.. పాకిస్థాన్‌ మాత్రం వితండవాదాలు.. అబద్దపు ఆధారాల వాదనలు చేస్తూ..తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో తాజాగా సర్ క్రీక్‌ దగ్గర సైనిక కార్యకలాపాలను విస్తరిస్తూ.. కయ్యానికి కాలుదువ్వుతోంది. అందుకే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ టెర్రరిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా పాకిస్థాన్ బుద్ది మారకపోతే ఆ దేశ నాశనం తప్పదు.

Related News

Devaragattu Bunny Utsavam: కొట్టుకు చావడమే సాంప్రదాయమా..! మాల మల్లేశ్వర ఏంటి కథ..

Telangana BJP: అలక, ఆవేదన, అసంతృప్తి.. కొత్త నేతలకు గడ్డుకాలమేనా?

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Big Stories

×