“ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆటో ర్యాలీలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురూ ఆటోలు ఎక్కి సభా వేదిక వద్దకు వచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
పట్టాభిషేకం..
బాహుబలి పార్ట్-2లో మహారాజుగా రానా పట్టాభిషేక సమయంలో బాహుబలి పేరు వినగానే సైనికులు, ప్రజలంతా హర్షధ్వానాలు చేస్తుంటారు. ఆ సౌండ్ కి రానా సింహాసనమే కదిలిపోయేలా కనపడుతుంది. సరిగ్గా అలాంటి సౌండ్ విజయవాడలో రీసౌండ్ లా వినపడింది. సీఎం చంద్రబాబు ప్రసంగంలో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ అనగానే అక్కడ ఉన్న అభిమానులంతా వెంటనే ఓజీ ఓజీ అంటూ అరిచారు. సరిగ్గా బాహుబలి సీన్ ని గుర్తుకు తెచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ వీడియోతోపాటు, బాహుబలి సీన్ ని మిక్స్ చేసి వైరల్ చేస్తున్నారు అభిమానులు.
Also Read: ఆటోల్లో చంద్రబాబు, పవన్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు
ఉత్సాహపరిచిన చంద్రబాబు..
బాహుబలిలో హీరో, విలన్ ఇలా రెండు బ్యాచ్ లు ఉంటాయి. కానీ ఇక్కడ కూటమిలో అందరూ ఒకటే జట్టు. పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే అభిమానులు ఓజీ ఓజీ అంటూ కేకలు వేయడంతో సీఎం చంద్రబాబు కూడా సంతోషించారు. వారిని ఉత్సాహపరుస్తూ ఓజీ సినిమాని గుర్తు చేశారు. ఇటీవలే ఓజీ సినిమా చూశారని, ఆ తర్వాత దసరా పండగ చేసుకున్నారంటూ ఉత్సాహపరిచారు. చంద్రబాబు మాటలతో అభిమానులు మరింత హంగామా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Baahubali Scene Recreated 🔥🔥🔥🔥#Pawankalyan #TheyCallHimOG
Cults and Sainiks Happy 🔥🔥🔥🔥
Retweet button badhalaipovali ⚡⚡ pic.twitter.com/d6X2STcWP7— Andhra King (@Andhra_KingPK) October 4, 2025
ఓజీ ఫీవర్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఓజీ ఫీవర్ మొదలైంది. సినిమా విడుదల తర్వాత కూడా ఇంకా ఆ ఉత్సాహం తగ్గలేదు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ చేసిన సినిమాల్లో ఓజీకి మాత్రమే విపరీతమైన హైప్ వచ్చింది. పవన్ కూడా ఉత్సాహంగా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు, సక్సెస్ మీట్ కి కూడా ఆకట్టుకునే గెటప్ లో గన్ పట్టుకుని వచ్చి అభిమానుల్ని అలరించారు. పవన్ సినిమా విజయవంతం కావాలంటూ అప్పట్లో రాజకీయ నాయకులంతా ట్వీట్లు వేశారు. ఓజీ విడుదల తర్వాత ఇటీవల పవన్ రాజకీయ కార్యక్రమానికి హాజరు కావడంతో అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. పవన్ కనపడగానే హర్షధ్వానాలు చేశారు, సీఎం నోటి వెంట పవన్ కల్యాణ్ అనే పేరు వినగానే మరింత ఉత్సాహంగా సందడి చేశారు. విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఈ సన్నివేశం హైలైట్ గా మారింది.
Also Read: Also Read: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?