BigTV English

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రచార అస్త్రం ఏంటి? సొంత మీడియా సాక్షి ఉంది కానీ వైసీపీ సానుభూతి పరులు మినహా ఇంకెవరూ సాక్షిని ఆదరించరనే ప్రచారం ఉంది. ఇక్కడ వైసీపీకి కావాల్సింది అభిమానుల జేజేలు కాదు, తటస్థుల మద్దతు. దానికోసమే వైసీపీ సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనుకుంటోంది. 2019లో వైసీపీ గెలుపులో అప్పటి ఐప్యాక్ టీమ్ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. అప్పట్లో ఐప్యాక్ అధినేతగా ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలసి జగన్ సంబరాలు చేసుకున్నారు కూడా. 2024 నాటికి పరిస్థితి మారిపోయింది. వైసీపీ సొంత డిజిటల్ టీమ్ ని తయారు చేసుకుంది కానీ కష్టాలు పడింది. అటు టీడీపీ మీడియాతోపాటు, సోషల్ మీడియాలో కూడా దూకుడు పెంచి ఘన విజయం సాధించింది. కానీ రోజు రోజుకీ పరిస్థితులు చాలా మారిపోయాయి. సోషల్ మీడియా ప్రచారం కంటే ఫేక్ ప్రచారానికే ఎక్కువగా పనికొస్తోంది. ఈ ఫేక్ ప్రచారంతో ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ దుష్ప్రచారాన్ని కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోడానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ఏర్పాటు వైసీపీకి మింగుడు పడని వ్యవహారంలా మారింది.


ఫేక్ న్యూస్..
మీడియాలో తప్పుడు వార్తలు వస్తే ఆ న్యూస్ పేపర్, లేదా ఛానెల్ క్రెడిబిలిటీ పడిపోతుంది. పదే పదే తప్పుడు వార్తలు వేస్తే వాటివైపు ఎవరూ చూడరు, ఆ పేపర్ ఎవరూ కొనరు. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే ఇక్కడ అలాంటి భయాలేవీ లేవు. ఫేక్ న్యూస్ క్షణాల్లో వ్యాపిస్తుంది, అది తప్పు అని తెలిసి ఆ అకౌంట్ ని బ్లాక్ చేసుకునే లోపు అలాంటివి వందల అకౌంట్లు పుట్టుకొస్తాయి. అసలు ఎవరు ఆ న్యూస్ ని ప్రచారంలోకి తెచ్చారనేది కూడా తెలుసుకోవడం కాస్త కష్టమే. అందుకే ఫేక్ న్యూస్ లు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. దీన్ని కట్టడి చేయాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం.

వైసీపీ భయమేంటి?
ఇప్పటి వరకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే భారతీయ నేర సంహితలోని 111 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. వైసీపీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు తమ పార్టీ సానుభూతి పరులైన 2వేలమందిపై కేసులు నమోదు చేశారని అంటున్నారు. ఇటీవల కాలంలో 111 సెక్షన్ దుర్వినియోగంపై కోర్టులు కూడా కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ నేపథ్యంలో సరికొత్త మార్గం అణ్వేషిస్తోంది కూటమి ప్రభుత్వం. ఒక నోడల్ ఏజెన్సీని తెరపైకి తేవాలనుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఎలాంటి పరిస్తితులు ఉన్నాయో మంత్రి వర్గ ఉపసంఘం అధ్యయనం చేయబోతోంది. అయితే వైసీపీలో భయం పెరిగిపోతోంది. కేవలం తమను టార్గెట్ చేసుకుని ఈ ఉపసంఘం పనిచేస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు.


నేషనల్ మీడియాకి మొర..
సోషల్ మీడియా కట్టడికి ఏపీలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని, ఇతర రాష్ట్రాల్లో ఇది ఎక్కడా లేదని అంటున్నారు వైసీపీ నేతలు. నేషనల్ మీడియాని ట్యాగ్ చేస్తూ వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర పరిధిలో ఉన్న ఐటీ చట్టానికి మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని తెలిసినా కూడా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిటీ వేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారని వారు మండిపడుతున్నారు.

టీడీపీ రియాక్షన్..
తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు హద్దుమీరుతున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమ అరెస్ట్ ల గురించి వారు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నిస్తున్నారు. తమ హయాంలో కేవలం తప్పు చేసినవారిపైనే కేసులు పెడుతున్నామని అంటున్నారు. మొత్తమ్మీద ఫేక్ న్యూస్ లపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం వ్యవహారం సంచలనంగా మారింది. వైసీపీ ఈ వ్యవహారాన్ని మరో రెడ్ బుక్ గా పరిగణిస్తోంది. జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది.

Related News

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

TDP Leader Arrest: నకిలీ మద్యం కేసులో.. టీడీపీ నేత సురేంద్ర బాబు అరెస్ట్

Auto Driver Sevalo Scheme: ఆటోల్లో చంద్రబాబు, పవన్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు

Vijayawada News: ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం.. మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Ambati Rambabu: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?

Amaravati News: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఇక మీరెందుకు? కళ్లెం వేయాల్సిందే

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Big Stories

×