iPhone 16 Plus| ఐఫోన్ 16 సిరీస్ లో పాపులర్ ఫోన్ అయిన ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధరపై ఇప్పుడు రూ.10,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పెద్ద స్క్రీన్ గల ఫోన్ కావాలనుకుంటున్న వారికి ఇది బెస్ట్ సమయం. ఫెస్టివల్ సీజన్‌లో ఈ ఆఫర్ మరింత స్పెషల్‌గా ఉంది.
ఐఫోన్ 16 ప్లస్ బేస్ వేరియంట్ ఇప్పుడు రూ.79,999కు మాత్రమే లభిస్తోంది. సెప్టెంబర్ 2024లో లాంచ్ అయిన సమయంలో దీని ధర రూ.89,900గా ఉండేది. అంటే దాదాపు రూ.10,741 తగ్గింపును సూచిస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌తో మీరు పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేయవచ్చు.
మీరు పేమెంట్ కోసం ఆక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ ఉపయోగిస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది గరిష్ఠంగా రూ.750 వరకు లభిస్తుంది. దీంతో ఎఫెక్టివ్ ధర రూ.79,249కు తగ్గిపోతుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఎక్స్ఛేంజ్ ద్వారా మీరు రూ.43,840 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది మీ పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ ఫోన్ ధరను చాలా తగ్గించగలదు.
ఈ ఫోన్‌లో 6.7-ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఉంది. ఇది 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మెరుగైన సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌లు ఉన్నాయి. డివైస్‌కు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ ఉంది.
ఐఫోన్ 16 ప్లస్ లో ఆక్టా-కోర్ పవర్‌ఫుల్ A18 చిప్ ప్రాసెసర్ ఉంది. ఇది అన్ని టాస్క్‌లకు స్మూత్, ఫాస్ట్‌గా పెర్ఫామ్ చేస్తుంది. అంతేకాదు స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో వస్తుంది.
రియర్ కెమెరా సిస్టమ్‌లో 48MP వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది. ఇందులో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది. మీరు హై-క్వాలిటీ ఫోటోలు, వీడియోలు తీయగలరు.
ఈ ఫోన్ 5G, వైఫై 6E వంటి మాడర్న్ కనెక్టివిటీ స్టాండర్డ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4G LTE, బ్లూటూత్, GPS, NFC కూడా ఉన్నాయి. ఛార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ కోసం USB టైప్-C పోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్లస్‌లో పెద్ద డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న భారీ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఈ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. పెద్ద స్క్రీన్, ప్రీమియం ఫీచర్‌లు కావాలనుకుంటున్న వారికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్.
Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి