Sandhya Shantaram: బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కాలం చేస్తూనే ఉన్నారు. చాలామంది ప్రేక్షక అభిమానులు ఇది జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.
ప్రముఖ నటి, దివంగత నిర్మాత వి. శాంతారామ్ భార్య సంధ్య శాంతారామ్(94) కన్నుమూశారు. ‘పింజర’ చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందిన ఆమె.. పలు హిందీ, మరాఠీ సినిమాలలో నటించారు. తన అసాధారణ నటనా, నృత్య నైపుణ్యంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సంధ్య మృతి పట్ల మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ నివాళులర్పించారు.
ఝనక్ ఝనక్ పాయల్ బాజే సినిమా కోసం శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. ఈ సినిమా విజయవంతమై, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు.దో ఆంఖేన్ బరాహ్ హాత్ సినిమాలో సంధ్య తన భర్త పక్కన నటించారు. ఆమె మరణ వార్త తెలియగానే బాలీవుడ్ అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయిపోయింది.
Also Read: Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?