ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తాజాగా ఉక్రెయిన్ లోని నార్త్ సుమీ ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషన్ టార్గెట్ గా రష్యా బలగాలు డ్రోన్ దాడులకు దిగాయి. ఆ సమయంలో కీవ్ కు వెళ్తున్న ప్యాసింజర్ రైలుపై బాంబులు పడ్డాయి. ఈ దాడిలో రైల్లో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. రైలు చాలా వరకు తుక్కు తుక్కుగా మారిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, మొత్తం ఎంత మంది గాయపడ్డారు? ఎవరైనా చనిపోయారా? అనే విషయంపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా సంస్థంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 30 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో బోగీలకు అంటుకున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ విజువల్స్ లో బాంబు దాడికి రైలు పూర్తి స్థాయిలో ధ్వంసం అయినట్లు కనిపిస్తుంది. పగిలిపోయిన కోచ్ లో కాలిపోతూ కనిపిస్తున్నాయి. ‘‘సుమీలోని రైల్వే స్టేషన్ పై రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. ఈ విషయం బహుశ రష్యా ప్రజలకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ దుర్మార్గపు, ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచం మౌనంగా ఉండకూడదు. ప్రతి రోజూ రష్యా ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను తీస్తుంది. యుద్ధ పరిష్కారం కోసం అమెరికా, యురోపియన్ కంట్రీస్ నుంచి చాలా ప్రకటనలు వినిపిస్తున్నాయి. కానీ, మాకు మాటల సాయం సరిపోదు. బలమైన చర్యలు అవసరం” అని జెలన్ స్కీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
A savage Russian drone strike on the railway station in Shostka, Sumy region. All emergency services are already on the scene and have begun helping people. All information about the injured is being established. So far, we know of at least 30 victims. Preliminary reports… pic.twitter.com/ZZoWfPmpL5
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 4, 2025
Read Also: జస్ట్ రూ. 22 వేలకే 4 పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC క్రేజీ ప్యాకేజీ!
షోస్ట్కా నుంచి రాజధాని కీవ్ కు వెళ్తున్న రైలు మీద దాడి జరిగిందని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ హ్రిహోరోవ్ వెల్లడించారు. ఈ రైల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో వైద్యులు, రెస్క్యూ సిబ్బంది మోహరించినట్లు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అయితే, ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలే టార్గెట్ రష్యా దాడులు చేస్తుంది. గత రెండు నెలలుగా ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను బాంబు దాడులతో ధ్వంసం చేసింది.
Read Also: 300 మైళ్ల ప్రయాణం.. రూ. 350కే టికెట్.. మయన్మార్ లో ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందా?