BigTV English

Vivo S19 Series Smartwatch Launch: కొంటే ఇలాంటి స్మార్ట్‌వాచ్ కొనాలి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..

Vivo S19 Series Smartwatch Launch: కొంటే ఇలాంటి స్మార్ట్‌వాచ్ కొనాలి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..

Vivo S19 Series Smartwatch Launching on May 30 2024: మన అవసరాలకు స్మార్ట్‌ఫోన్ ఎంత అవసరమో స్మార్ట్‌వాచ్ కూడా అంతే ముఖ్యమైంది. స్మార్ట్‌వాచ్ మీ పనులను సులభతరం చేస్తుంది. వీటిలో అనేక గొప్ప ఫీచర్లు ఉంటాయి. దీనితో మీరు కాల్స్ మాట్లాడొచ్చు, మేసెజెస్ చేయవచ్చు. అంతే కాకుండా మీ హెల్త్‌ను కూడా మానిటర్ చేయవచ్చు. ఇవి మీకు మంచి ఫ్యాషన్ లుక్‌ను కూడా ఇస్తాయి. ఈ క్రమంలో వివో తన రాబోయే వాచ్, స్మార్ట్‌ఫోన్ vivo S19 సిరీస్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.


కంపెనీ మే 30న సాయంత్రం 7 గంటలకు S19 స్మార్ట్‌‌ఫోన్‌ ప్రదర్శించనుంది. ఈ నేప‌థ్యంలో కంపెనీ నుంచి ఓ పెద్ద స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్పుడు కంపెనీ ఈ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు తన సరికొత్త Vivo WATCH GT స్మార్ట్‌వాచ్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ వాచ్ 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. లాంచ్ చేయడానికి ముందు స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకోండి.

Also Read: ఇదేక్కడి ఆఫర్ భయ్యా.. రూ.354లకే స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తారంటా.. మూడు రోజులు మాత్రమే!


vivo WATCH GT స్మార్ట్‌వాచ్ ఆకర్షణీయమైన డయల్ డిజైన్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్‌ను అందించనుంది. ఇందులో బ్లూ, పింక్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. దీనిలో మీరు మృదువైన రబ్బరు స్ట్రాప్‌ను పొందుతారు. ఇది కాకుండా eSIM కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీ ఫీచర్‌ని కూడా పొందుతారు.

లీక్ అయిన వివరాల మేరకు ఈ స్మార్ట్ వాచ్ 2ATM వాటర్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంటుంది. ఇది త్వరగా నోట్స్ తీసుకోవడానికి AI షార్ట్‌హ్యాండ్, వ్యక్తిగతీకరణ కోసం AI వాచ్ ఫేస్‌లు, మీ షెడ్యూల్‌ను ట్రాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే AI స్మార్ట్ రిమైండర్‌ల వంటి స్మార్ట్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.

Also Read: రెండు పవర్‌ఫుల్ ఫోన్లు గ్రాండ్ ఎంట్రీ.. ఏది బెస్టో తెలుసా?

vivo WATCH GT బ్లూటూత్ మోడ్‌లో 21 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వారాలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. దాని స్టైలిష్ డిజైన్, ఫంక్షనల్ ఫీచర్లు , సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో గొప్ప ఎంపికగా కనిపిస్తుంది.

Tags

Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×