Brahmamudi serial today Episode: దుగ్గిరాల ఇంటికి వచ్చిన కావ్య ఎమీ జరగనట్టు బిహేవ్ చేస్తుంటే అందరూ షాక్ అవుతారు. కావ్య ఏం చేస్తున్నావు.. అంటూ అడగ్గానే కావ్య నవ్వుతూ మాట్లాడుతుంది. దీంతో అపర్ణ కావ్య ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నవ్వుతున్నావా..? అని అడుగుతుంది. దీంతో అదేంట అత్తయ్యా ఈ ఇంట్లో నవ్వడం బ్యాన్ చేశారా..? ఏంటి..? ఇంక నేను వచ్చేశానుగా ఆ ప్రాబ్లమే ఉండదు.. ఆ బ్యాన్ ఎత్తేస్తాను లేండి.. అంటుంది. దీంతో స్వప్న కోపంగా కావ్య ఇక ఆపవే నీ నటన. నీ నటనతో నవ్వించగలవని..ఏడ్చి ఏదైనా సాధించగలవని ప్రపంచం అంతా తెలిసిపోయింది అని చెప్పగానే.. అవునా అక్కా మరి మీ అందరికీ తెలిసిపోయి ఉండాలే అని కావ్య అనగానే.. నీ నటనే కాదు ఇన్నాళ్లు మాకు తెలియకుండా దాచిన నిజం కూడా తెలిసిపోయింది అంటుంది ఇంద్రాదేవి.
అంతటి భయంకరమైన నిజం తెలిసి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో కళ్లారా చూసి ఏం చేయాలో అర్థం కాక నిన్ను ఎలా కాపాడుకోవాలో అంతు చిక్కక మేమందరం టెన్షన్ పడుతుంటే.. నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు ఎలా ఉన్నావు.. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు.. అని అపర్ణ అడుగుతుంది. దీంతో కావ్య.. అత్తయ్య మీరు నిజం తెలిసి టెన్షన్ పడుతున్నారు. కానీ నేను ఆ నిజం తెలియక దిగులు పడ్డాను. ఇన్నాళ్లు మీ అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించారో నాకు అర్థం కాక నాలో నేనే సతమతం అయ్యాను. కానీ అత్తయ్యా ఆయన ఎందుకు అలా చేశారో.. ఆయన ప్రవర్తనకు కారణం ఏంటో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకెందుకు అత్తయ్యా బాధపడటం అంటుంది. దీంతో సుభాష్ ఏంటమ్మా ఇది అసలు ఏమంటున్నావో నీకైనా అర్థం అవుతుందా.? అని అడగ్గానే.. నిన్నటి దాకా మీకు అందరికీ అర్థం కాక నన్ను ప్రశ్నించారు. ఈరోజు నాకు అర్థం అయి మీ అందరికీ జవాబు చెప్తుంటే.. నాకు అర్తం కాలేదు అనడం వ్యర్థం కదా మామయ్య అంటుంది కావ్య..
ఇంతలో అపర్ణ కోపంగా నీకు పిచ్చి పట్టిందే.. నీ ప్రాణాలు పోతాయి అని చెప్తున్నాడే వాడు అనగానే.. కానీ నా కడుపులో బిడ్డ ప్రాణాలు నిలబడతాయి కదా అత్తయ్య అంటుంది కావ్య. నీది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియడం లేదు కావ్య.. బిడ్డను మోస్తే నీ ప్రాణాలు పోతాయంటుంటే.. నీకు సరదాగా ఉందా..? అని ఇంద్రాదేవి అడుగుతుంది. దీంతో కావ్య అమ్మమ్మగారు ఉరిమే ఉరుమును.. కురిసే వానను.. పోయే ప్రాణాన్ని ఎవ్వరూ ఆపలేరు అమ్మమ్మ అంటుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఏడ్చినట్టు ఉంది నీ వేదాంతం.. ఉరుము వినబడకుండా చెవులో దూదులు పెట్టుకోవచ్చు.. వానకు తడవకుండా గొడుగు పట్టుకోవచ్చు.. అలాగే నా మనవడు చెప్పినట్టు చేస్తే నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా హాయిగా ఆనందంగా బతకొచ్చు అని చెప్పగానే.. అంటే నన్ను నేను బతికించుకోవడం కోసం అమ్మ అనే మాటకున్న అర్థాన్ని చంపేయమంటారా..? ఆడదానికి అమ్మ అనే పిలుపే ఒక వరం ఆ వరాన్ని అందుకోకుండా నా బిడ్డ స్వరాన్ని కడుపులోనే నొక్కేయమంటారా..? తన ఆయుష్షును కూడా పోసి తన బిడ్డకు లోకాన్ని చూపిస్తే అది అసలైన అమ్మతనం.. కానీ అదే బిడ్డ ఊపిరి తీసి తను బతకాలి అనుకోవడం అనర్థం. ఆ అనర్థానికి నేను తావు ఇవ్వాలని అనుకోవడం లేదు అమ్మమ్మ అని చెప్పగానే..
అప్పుడే పైనుంచి వచ్చి రుద్రాణి.. కావ్యను మెచ్చుకుంటుంది. దీంతో స్వప్న కోపంగా రుద్రాణిని తిడుతుంది. ప్రకాష్, అపర్ణ కూడా రుద్రాణిని తిడతారు. దీంతో మీరు ఏమైనా అనుకోండి కానీ కావ్యను మెచ్చుకోకుండా ఉండలేను అంటుంది రుద్రాణి. కానీ అందరూ మాత్రం కావ్య చేసేది తప్పు అంటారు. కావ్య మాత్రం తనకు తన బిడ్డే ముఖ్యం అని చెప్తుంది. అప్పుడే బయటకు వచ్చిన రాజ్ కావ్య మాటలు విని షాక్ అవుతాడు. తర్వాత కావ్యను పలిచి అబార్షన్ చేయించుకోమని చెప్తాడు సీతారామయ్య. కావ్య అందుకు ఒప్పుకోదు. తర్వాత ఇంట్లో వాళ్లుందరూ కలసి కావ్యను ఎలాగైనా కన్వీన్ చేయాలని అందుకోసం ఒక నాటకం ఆడాలని ప్లాన్ చేస్తారు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.