BigTV English

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్
Advertisement

Kurnool Bus Incident:  కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి. ఘటన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్, రవాణామంత్రి, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఘటన గురించి వివరాలు సేకరించారు. ఉన్నతస్థాయి అధికారులు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగ్రాతులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. అలాగే మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపట్టారు సూచన చేశారు.


షాకైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచన చేశారు. గద్వాల్ కలెక్టర్ ,ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్ళాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


కర్నూలు బస్సు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని అన్నారు మాజీ సీఎం జగన్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. మృతులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వెంటనే ఆయన ఘటన జరిగిన ప్రాంతానికి బయలుదేరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి.

ALSO READ: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఓల్వో బస్సు

ఓల్వో బస్సు ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ విషయంలో ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందవద్దని తెలిపారు.

 

Related News

Kurnool Bus Tragedy: అరుపులు.. ఏడుపులు ప్రమాదం ఎలా జరిగిందో.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ట్రావెల్ బస్సు గురించి కొత్త విషయాలు, ఇప్పుడెలా?

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగైదు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Ys Jagan: గవర్నర్ వద్దకు జగన్.. ఎందుకంటే?

Bhumana Karunakar Reddy: టీటీడీలో ఉన్నవాళ్లంతా నా మనుషులే.. కాన్ఫిడెన్షియల్ సమాచారం నా చేతికి: భూమన సంచలన వ్యాఖ్యలు

Big Stories

×