OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాలలో వచ్చే ట్విస్టులు, బ్లడ్ బాత్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తున్నాయి. కిల్లర్ హత్యలు చేసే స్టైల్ ని కూడా కొత్త తరహాలో చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలకు భాషతో కూడా పని ఉండదు. ఎందుకంటే ఈ సినిమాలలో డైలాగులు తక్కువ, హింస ఎక్కువగా ఉంటుంది. హావ భావాలతోనే ఈ సినిమా ఇంటెన్స్ అర్థమైపోతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైకో సినిమా, ఒక హై స్కూల్ స్టూడెంట్‌ల హత్యల చుట్టూ తిరుగుతుంది. ఒక మాస్క్ కిల్లర్ ఈ హత్యలు చేస్తుంటాడు. అతను ఎందుకు ఈ హత్యలను చేస్తున్నాడనేదే ఈ కథ. ఈ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీ లో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘దేర్స్ సమ్ వన్ ఇన్‌సైడ్ యువర్ హౌస్’ (There’s someone inside your house) 2021లో వచ్చిన అమెరికన్ స్లాషర్ హారర్ మూవీ. ప్యాట్రిక్ బ్రైస్ దర్శకత్వంలో మకాని (సిడ్నీ పార్క్), డేవిడ్ (థియోడోర్ పెల్లరిన్), జేక్ (జెస్సీ లాటౌరెట్), రోద్ (అషా కూపర్), జాక్ (డేల్ వైబ్లీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 అక్టోబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మకాని అనే అమ్మాయి హవాయి నుంచి ఆస్బోర్న్ అనే గ్రామానికి వస్తుంది. ఆమె హై స్కూల్‌లో డేవిడ్, జేక్, రోద్, జాక్ అనే కొత్తవాళ్లతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. వాళ్లు అందరూ 12వ తరగతి స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సమయంలో ఆ గ్రామంలో భయంకరమైన హత్యలు మొదలవుతాయి. ఒక కిల్లర్ విద్యార్థుల సీక్రెట్స్ బయటపెట్టి, ముఖం మాస్క్ పెట్టుకుని హత్యలు చేస్తుంటాడు. అయితే మొదటి హత్యను జాక్ తో మొదలు పెడతాడు. అతని సీక్రెట్స్ బయట పెట్టి, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో మకాని స్నేహితులు భయపడతారు. కానీ వాళ్లు కలిసి కిల్లర్‌ను కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు.
Read Also : స్టార్ హీరోయిన్ల బోల్డ్ అటెంప్ట్… ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్
అయితే కిల్లర్ హత్యలు ఆపకుండా, ఒక్కొక్కరి రహస్యాలు బయట పెడుతూ చంపుతుంటాడు. వీటిలో అల్కహాల్ అడిక్షన్, సెక్సువల్ అబ్యూస్, ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి. మకాని గతంలో, హవాయిలో ఒక పెద్ద రహస్యం ఉంది. అది కూడా బయటపడుతుంది. ముందు మకాని భయపడినా, ధైర్యంగా ఆ మాస్క్ కిల్లర్ గురించి తెలుసుకుంటుంది. కిల్లర్ ఒక స్టూడెంట్ అని, అతను రహస్యాలు బయటపెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాడాని తెలుసుకుంటుంది. ఇక చివరగా మకానిని కిల్లర్ చంపడానికి వస్తాడు. ఇక్కడ స్టోరీ ఊహించని ట్విస్ట్ తీసుకుంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? కిల్లర్ ఎవరు ? ఎందుకు సీక్రెట్స్ బయట పెట్టి హత్యలు చేస్తున్నాడు ? మకాని విషయంలో అసలేం జరుగుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.