E-Paper
Advertisement

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో
Advertisement

Kurnool Bus Incident:  కర్నూలు బస్సు ప్రమాద ఘటన అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయిందన్నాడు అందులోని ప్రయాణికుడు. నిద్రలో నుంచి తాము కళ్లు తెరిచే లోపు భారీ మంటలు, దట్టమైన పొగ వ్యాపించిందన్నాడు. తనతోపాటు మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి బయటపడ్డామని తెలిపారు. ఆ దేవుడే తమను కాపాడాడని కన్నీరుమున్నీరు అయ్యాడు.

ప్రయాణికుడు-ప్రత్యక్ష సాక్షి మాటల్లో

Advertisement

ప్రైవేటు బస్సు ప్రమాదం ఎలా జరిగిందో వివరించాడు ప్రత్యక్ష సాక్షి. తాను హిందూపూర్ నుంచి నంద్యాల వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగడం చూశానని తెలిపాడు. రమేష్ అనే వ్యక్తి బస్సు అద్దాలు పగులకొట్టి బయటకు వచ్చాడని తెలిపారు. ఆరుగుర్ని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లానని తెలిపాడు.

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం గురించి తెలియగానే ఆ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బస్సు బయలు దేరిందన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను బస్సు ఢీ కొట్టిందని తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు అంతా వ్యాపించాయి.

Advertisement

ఘటన ప్రాంతంలో అధికారులు, వివరాలు ఆరా

ఆ సమయంలో ప్రయాణికులు నిద్రిస్తుండడంతో ప్రాణనష్టం భారీగా జరిగిందన్నారు. ఘటన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు. 20 నుంచి 25 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారని, మరో 20 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతం నుంచి బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు.

ALSO READ: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్ బస్సు దగ్ధం, 20 మందిపైకి పైగానే

అదనపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రమాదం నుంచి 12 మంది బయటపడ్డారు. వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్‌రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జస్మిత, రమేష్‌, సుబ్రహ్మణ్యం ఉన్నారు. మరో 11 మందికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×