Gundeninda GudiGantalu Today episode October 24 th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి తన బండారం మొత్తం బాలుకి తెలిసిపోయిందని భయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే వెళ్లి విద్యతో ఈ విషయాన్ని చెప్తుంది. బాలు మీనాలకు దినేష్ గురించి నా గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇంట్లో అందరికీ చెప్పేస్తారు నా పరిస్థితి అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. నా రెండో పెళ్లి కూడా నిలబడలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక విద్య ఇప్పటికే ఆలస్యమైంది నీ తప్పు ఏమీ లేదని మొత్తం చెప్పేసేయ్ అని అంటుంది. రోహిణి ఎందుకు చెప్పు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తన తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అనుకుంటుంది.. మనోజ్ ఫోన్ చేయడం చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. కచ్చితంగా వీళ్ళకి నిజం తెలిసిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి గురించి నిజాలను దినేష్ చెప్పలేదని సంతోష పడుతుంది. అందరు కలిసి దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం కుటుంబంలో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. అందరు టపాసులను కాల్చి ఎంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళందరి సంతోషాన్ని చూసిన శోభా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతుంది. ఈ సంతోషాన్ని మరింత సేపు ఉంచను కాసేపట్లో దూరం చేస్తాను అని అంటది. మీరు గది కోసం రోజు గొడవ పడుతున్నారు కదా నా వంతు సహాయంగా నేను ఐదు లక్షలు ఇస్తాను అని అంటుంది. బాలు రెచ్చిపోయి ఆమెకు బుద్ధి చాలా చెప్తాడు.
మీ నాన్నగారు ఇంటికి లోన్ కోసం మా ఆయన దగ్గర సంతకం కోసం చాలాసార్లు తిరిగారు ఆయన సంతకం చేస్తేనే లోన్ వచ్చింది.. ఇప్పుడు గది వేయించాలంటే కచ్చితంగా ఇంకెన్ని జరుగుతాయి అని శోభా దారుణంగా మాట్లాడుతుంది.. మీరేం మాట్లాడుతున్నారు మా ఇంట్లో డబ్బులు లేకపోవచ్చు మేము ఎప్పుడు ఒకసారి గదిని వేసుకుంటాము అని బాలు అంటాడు. నిజానికి మా ఆయన దయ తలచి సంతకం చేస్తేనే ఈ ఇంటిని కట్టారు.. ఇప్పుడు లోన్ పెట్టి మళ్ళీ ఇల్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది అందుకే నేను నా కూతురు కోసమని ఇస్తున్నాను. ఈ సాయాన్ని మీరు తీసుకోవాలని కావాలని గొడవ చేసేలా మాట్లాడుతుంది శోభ.
శోభ మాటకు మాట సమాధానం చెప్తాడు బాలు. మీరు ఇకనుంచి వెళ్ళిపోకపోతే నేను మెడ పట్టేది గెంటేస్తాను. ఆడవాళ్ళు కాబట్టి బ్రతికి పోయారు.. లేకుండా ఉంటే ఆ పని ఎప్పుడో చేసే వాడిని అని బాలు కూడా కోపంతో రెచ్చిపోయి మాట్లాడుతాడు. నేను డబ్బులు ఇస్తానంటే చూసావా బాలు ఎలా మాట్లాడుతున్నాడు అని కావాలనే శోభా ఇంకా రెచ్చగొడుతుంది.. బాలు కోపాన్ని ఎలాగైన కంట్రోల్ చేయాలని బాలుని కొడతాడు.. చూడమ్మా మాకు ఇల్లు లేకపోయినా సరే ఆత్మాభిమానం ఉంది మీరు దాన్ని దెబ్బతీయాలని మాత్రం చూడకండి అని శోభాతో అంటాడు.
బాలు ఆమె మన వియ్యపురాలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు.. పుట్టింటి నుంచి ఎవరు ఏమి తెచ్చుకోకూడదని నాకు బాగా అర్థమైంది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని శోభాని వేడుకుంటాడు. శోభ వెళ్ళిపోతుంది. శృతి భార్య, తల్లికి గౌరవం ఇవ్వలేని వాడు బయట వాళ్లకి ఎలా ఇస్తాడు ఒక మూర్ఖుడు అని శృతి అంటుంది. ఇక రోహిణి రవి శృతిని బయటకు పంపించాలని నువ్వే అనుకుంటున్నావా.. నువ్వేదో పెద్ద వీళ్ళిద్దరిని ఉద్ధరిస్తున్నట్లు చెబుతున్నావేంటి అని మనోజ్ కూడా తిడతాడు.. ప్రభావతి మా అందరినీ వాడుకుంటున్నావు బయట వాళ్ళని కూడా వదిలేయవా అని అంటుంది.
ఇక అందరూ బాలుని అనడంతో బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. శృతి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే రవితో గొడవ పెట్టుకుంటుంది. మీ అన్నయ్య ఎలా మాట్లాడాడో చూసావా. మా అమ్మకి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. అసలు మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా ఎలా మాట్లాడుతున్నాడో. అంటూ సీరియస్ గా బాలుని తిడుతూ ఉంటుంది. దానికి రవి మన ఇంట్లో విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావ్ ఏదైనా చెప్పేదానికి రవి మన ఇంట్లో విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావ్ ఏదైనా చెప్పే ముందు ఆలోచించాలి అని నీకు అర్థం కాదా అని రవి శృతి పై సీరియస్ అవుతాడు. మా అన్నయ్య కోపం గురించి నీకు తెలుసు మీ అమ్మ అంతగా మాట్లాడింది మా నాన్నని తక్కువ చేస్తూ మాట్లాడింది. అందుకే బాలు సీరియస్ అయ్యాడు.
Also Read: వణుకు పుట్టించే హారర్ సీరియల్స్.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
మీ అమ్మ చేసింది తప్పు కదా మా నాన్నని తక్కువ చేసింది అది నువ్వు ఆలోచించవా..? మీ అమ్మ ఉన్నప్పుడే మా మామయ్యను ఎందుకు అంటున్నావు అని ఒక్క మాటనుంటే బాలు అన్నయ్యకి అంత కోపం వచ్చేది కాదు కదా అని రవి శృతికి క్లాస్ పీకుతాడు. ఇక శృతి సైలెంట్ అవుతుంది. మెదటి నుంచి నువ్వు మీ అమ్మకి ఏదైనా చెప్పేటప్పుడు నాకు ముందు చెప్పు అని రవి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడే ఉంటే మనిద్దరి మధ్య దూరం పెరిగేలా ఉంది నేను బయటకు వెళ్తాను అని రవి వెళ్ళిపోతాడు.. మీనా బాలుని అందరు అనడంతో బాధపడుతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో జరుగుతుందో చూడాలి..