Redmi Note 15 Pro 5G: స్మార్ట్‌ఫోన్ అంటే ఇప్పుడు కేవలం కమ్యూనికేషన్ కోసమే కాదు, మన జీవితంలో ప్రతి చిన్న పనికి అవసరమైన ఒక భాగమైపోయింది. పని చేయాలన్నా, ఫోటోలు తీయాలన్నా, వీడియోలు చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా అన్నీ ఒక్క మొబైల్‌లోనే పూర్తవుతున్నాయి. అందుకే ప్రతీ కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్లోకి తెస్తుంది. అలాంటి ఫోన్లలో ఈ ఏడాది ఎక్కువ చర్చనీయాంశమైనది రెడ్‌మి నోట్ 15 ప్రో 5జి. ఎందుకంటే దీని ఫీచర్లు, డిజైన్, పనితీరు ఇవన్నీ ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉన్నాయి.
ఎలిగెంట్‌గా డిజైన్
చూడగానే ఈ ఫోన్ ఒక ప్రీమియం డివైస్‌లా కనిపిస్తుంది. దాని డిజైన్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు తేలికగా, సౌకర్యంగా ఉంటుంది. వెనుక భాగంలో గ్లాస్‌లా మెరిసే ఫినిష్, సైడ్‌లలో మెటల్‌లాంటి బాడీ కలిపి ఒక స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. ఈ ధరలో ఇంత అందమైన డిజైన్ రావడం నిజంగా ఆశ్చర్యం. రెడ్‌మి నోట్ 15 ప్రో 5జిని మొదటిసారి చూసినవారికి ఇది 20 వేల రూపాయల ఫోన్ అనిపిస్తుంది.
6.7 అంగుళాల డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలేడ్ స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్‌రేట్ 120Hz. అంటే వీడియోలు, గేమ్స్, స్క్రోలింగ్ అన్నీ చాలా స్మూత్‌గా అనిపిస్తాయి. ఎండలో బయట ఉన్నప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు చూడటానికి, సోషల్‌మీడియా బ్రౌజ్ చేయటానికి ఈ డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, డిస్‌ప్లేలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ వేశారు. ఈ ప్రాసెసర్ వల్ల యాప్స్ వేగంగా ఓపెన్ అవుతాయి, గేమ్స్ ల్యాగ్ లేకుండా రన్ అవుతాయి. అంటే ఒకేసారి ఎన్నో పనులు చేసినా ఫోన్ స్లో అవ్వదు. 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటంతో యూజర్‌కి స్పేస్ సమస్యే ఉండదు. అవసరమైతే మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు కూడా.
Also Read: Airtel Xstream Fiber: బఫరింగ్‌కు గుడ్‌బై.. ఎయిర్‌టెల్ అల్ట్రా వై-ఫైతో సూపర్ స్పీడ్.. ధర ఎంతంటే?
108ఎంపి ప్రధాన కెమెరా
ఇప్పుడు కెమెరా గురించి చెప్పుకోవాలి. ఈ ఫోన్‌లో 108ఎంపి ప్రధాన కెమెరా ఉంది. దీని ఫోటోలు చాలా క్లియర్‌గా, షార్ప్‌గా వస్తాయి. చిన్న చిన్న వివరాలు కూడా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తాయి. దానికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మాక్రో లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అంటే ఒకే ఫోన్‌తో విభిన్న కోణాల్లో ఫోటోలు తీయవచ్చు. రాత్రివేళల్లో కూడా దీని నైట్‌మోడ్ ఫోటోలు అద్భుతంగా వస్తాయి. సెల్ఫీ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్ అయినా, సోషల్‌మీడియా రీల్స్ అయినా ఈ ఫ్రంట్ కెమెరా క్లారిటీకి ఎవరూ సరితూగలేరు.
5000mAh బ్యాటరీ
బ్యాటరీ విషయంలో కూడా రెడ్‌మీ ఈసారి రాజీ పడలేదు. 5000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌తో రోజంతా సులభంగా పనిచేస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే 15 నుండి 20 నిమిషాల్లో అర్ధం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది బిజీగా ఉండే యూజర్లకు పెద్ద సహాయం.
ఎంఐయుఐ 15 ఆధారంగా ఆండ్రాయిడ్ 14
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఎంఐయుఐ 15 ఆధారంగా ఆండ్రాయిడ్ 14 ఉంది. కొత్త యానిమేషన్స్, వేగవంతమైన యాప్స్, ప్రైవసీ ఫీచర్లు అన్నీ అందించారు. కనెక్టివిటీ కోసం 5జి సపోర్ట్‌తో పాటు వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సి కూడా ఉన్నాయి. అంటే ఇది కేవలం బడ్జెట్ ఫోన్ కాదు టెక్నాలజీ పరంగా పూర్తి ఆధునిక ఫోన్. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలంటే రెడ్‌మి నోట్ 15 ప్రో 5జి ఖచ్చితంగా సరైన ఎంపిక అవుతుంది.
ధర విషయానికి వస్తే
భారత మార్కెట్లో మరోసారి షావోమి సంచలనం సృష్టించింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన రెడ్‌మి నోట్ 15 ప్రో 5G ధర కేవలం రూ.11,490గా నిర్ణయించబడింది. ఇదే మోడల్ అమెరికా మార్కెట్‌లో మాత్రం సుమారుగా $299 (దాదాపు రూ.24,900)కు అందుబాటులో ఉంది. ఈ భారీ ధర తేడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.