iPhone Battery Drain| సాధారంగా ఐఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే త్వరగా బ్యాటరీ మార్చాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది యూజర్లు ఐఫోన్ బ్యాటరీ త్వరగా బ్యాటరీ డ్రెయిన్ అయిపోతోందని.. ఆన్ లైన్ లో షేర్ చేస్తుంటారు. ఇది బ్యాటరీ సమస్య కాదు.. బ్యాటరీ సెట్టింగ్స్ లో సమస్య. అందుకే బ్యాటరీ లైఫ్ మెరుగుపరుచుకోవడానికి కొన్ని సాధారణ సెట్టింగ్స్ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్‌లు మారిస్తే.. బ్యాటరీ వినియోగాన్ని కాస్త నెమ్మది చేయవచ్చు. దీంతో మీ ఐఫోన్ బ్యాటరీ అదనపు గంటలు పనిచేస్తుంది.
మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ చెక్ చేయడానికి.. సెట్టింగ్స్ యాప్ ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత, బ్యాటరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ “బ్యాటరీ హెల్త్ & ఛార్జింగ్” ఆప్షన్ లో చూడండి. బ్యాటరీ శాతం.. 80% కంటే ఎక్కువ ఉంటే, అది మంచి సంకేతం. 80% కంటే తక్కువ ఉంటే, మీ బ్యాటరీ కాస్త పాతబడిందని అర్థం. ఒకవేళ బ్యాటరీ శాతం తక్కువ ఉన్నప్పటికీ.. కొన్ని టిప్స్ మీ బ్యాటరీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
లాక్ స్క్రీన్ విడ్జెట్‌లు ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తాయి. అవి నిరంతరం అప్డేట్లు అవుతూ ఉంటాయి. ఉదాహరణకు వాతావరణం లేదా క్రీడల అప్డేట్స్ అంటే క్రికెట్ మ్యాచ్ స్కోర్ వంటివి. ఇవి అనవసరంగా బ్యాటరీని వినియోగిస్తాయి. వీటిని తొలగించడానికి, లాక్ స్క్రీన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచండి. ఆ తర్వాత, “కస్టమైజ్” బటన్‌పై నొక్కండి. లాక్ స్క్రీన్ విడ్జెట్ బాక్స్‌ను ఎంచుకుని, ప్రతి విడ్జెట్ పైన ఉన్న మైనస్ బటన్‌ను నొక్కి వాటిని ఒక్కొకటిగా తొలగించండి.
కొత్త iOS సాఫ్ట్‌వేర్‌లో ఆకర్షణీయమైన యానిమేషన్‌లు, ఎఫెక్ట్‌లు ఉంటాయి. కానీ ఇవి ప్రాసెసర్ పవర్‌ని ఎక్కువగా వినియోగిస్తాయి. వీటిని ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ ఆదా అవుతుంది. సెట్టింగ్స్‌లో “యాక్సెసిబిలిటీ”కి వెళ్లండి. “మోషన్” సెక్షన్‌ను ఎంచుకుని, “రిడ్యూస్ మోషన్” టోగుల్‌ను ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంటర్‌ఫేస్ సరళంగా, బ్యాటరీ సమర్థవంతంగా మారుతుంది.
కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు స్వల్ప వైబ్రేషన్ ఇచ్చే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఫీచర్ ఉంది. వీటి వైబ్రేషన్ బ్యాటరీని క్రమంగా వినియోగిస్తుంది. దీన్ని ఆఫ్ చేయడం సులభం. సెట్టింగ్స్‌లో “సౌండ్స్ & హాప్టిక్స్”కు వెళ్లండి. “కీబోర్డ్ ఫీడ్‌బ్యాక్”ను సెలెక్ట్ చేసి.. “హాప్టిక్” స్విచ్‌ను ఆఫ్ చేయండి.
చాలా యాప్‌లు బ్యాక్ గ్రౌండ్‌లో అప్డేట్లు సేకరిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల బ్యాటరీ ఎక్కువగా వినియోగానికి గురవుతుంది. దీన్ని నియంత్రించడానికి.. సెట్టింగ్స్‌లో “జనరల్”కు వెళ్లండి. “బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్”ను ఎంచుకోండి. మీరు దీన్ని పూర్తిగా ఆఫ్ చేయవచ్చు లేదా అనవసరమైన యాప్‌లకు మాత్రమే ఆఫ్ చేయవచ్చు.
లో పవర్ మోడ్ ఒక పవర్‌ఫుల్ ఫీచర్. ఇది బ్యాక్‌గ్రౌండ్ కార్యకలాపాలు ఆటోమేటిక్ కాకుండా తగ్గిస్తుంది. దీన్ని ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. బ్యాటరీ 20 శాతానికి చేరినప్పుడు దీన్ని ఆన్ చేయండి. సులభంగా యాక్సెస్ చేయడానికి కంట్రోల్ సెంటర్‌లో ఈ ఆప్షన్ యాడ్ చేయవచ్చు.
సెట్టింగ్స్‌లో పై తెలిపిన సింపుల్ మార్పులు చేస్తే.. బ్యాటరీ ఎక్కువ సమయం పనిచేస్తోందని మీకే అర్థమవుతుంది. మీ ఐఫోన్ సులభంగా రోజంతా పనిచేస్తుంది.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?