Rashmika: రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరియర్ ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల థామా (Thammaa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) అనే మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్రబంధం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి ప్రతి ఒక్కరూ అద్భుతమైన స్పీచ్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. అలాగే ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్(Remuneration) గురించి కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాకు ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)దర్శకత్వం వహించగా, అల్లు అరవింద సమర్పణలో ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి.
తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత ధీరజ్ రష్మిక గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఈ సినిమాకు కనుక రష్మిక గారు ఒప్పుకోకపోతే మరెవరితోనూ మేము ఈ సినిమా చేయలేము అని తెలిపారు. ఈ సినిమాకు రష్మిక గారు ఓకే చెప్పిన తర్వాత రెండు రోజులకు తాను రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటానికి తన మేనేజర్ ని ఫాలో అయ్యాను కానీ ఆయన అందుబాటులోకి రాలేదు దీంతో నేరుగా రెమ్యూనరేషన్ గురించి రష్మిక గారితో మాట్లాడామని తెలిపారు. ఈ సినిమా రెమ్యూనరేషన్ గురించి రష్మిక గారితో మాట్లాడితే ఆవిడ ఒకటే మాటే చెప్పారు.
తను ఈ సినిమా చేయడానికి ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ తీసుకోనని ప్రస్తుతం సినిమా పూర్తి చేయాలని ఈమె తెలిపారు సినిమా విడుదలైన తరువాతనే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడదామని రష్మిక చెప్పినట్టు ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ వెల్లడించారు. రష్మిక ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి కూడా రూపాయి తీసుకోకుండా సినిమాలో నటించడం అంటే నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ నిర్మాత చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేశారనే విషయం తెలిసిన రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లే ఇండస్ట్రీకి కావాల్సింది అంటూ అభిమానులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.