పండుగ ప్రయాణాల నేపథ్యంలో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు దీపావళికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణీకులతో పాటు ఛత్ పూజ కోసం సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులతో రద్దీ మరింత పెరిగింది. ఈ సమయంలోనే IRCTC వెబ్ సైట్ తో పాటు యాప్ సర్వర్ డౌన్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్ సైట్ లో లాగిన్ కాలేకపోతున్నారు. మరికొంత మంది లాగిన్ అయినప్పటికీ టికెట్ కోసం పేమెంట్ చేసే సమయంలో ఫెయిల్ అవుతున్నారు. మరికొంత మంది వినియోగదారులకు IRCTC వెబ్ సైట్, యాప్ లో “ఈ సైట్ ప్రస్తుతం అందుబాటులో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి” అనే పాపప్ కనిపిస్తోంది.
దీపావళి తర్వాత, దేశ వ్యాప్తంగా ప్రజలు ఛత్ పూజ కోసం ఉత్తరప్రదేశ్, బీహార్ లోని వారి స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఏ రైల్వే స్టేషన్ చూసినా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కనిపిస్తున్నారు. అదే సమయంలో టికెట్ బుకింగ్ కోసం కోట్లాది మంది ప్రయాణికులు IRCTC వెబ్ సైట్ తో పాటు యాప్ లో ప్రయత్నిస్తున్నారు. రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపినప్పటికీ, వీటిలో టికెట్ బుక్ చేసుకోవడం కష్టంగా మారింది. వెబ్ సైట్ గంటల తరబడి పని చేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీపావళికి ముందు కూడా వెబ్ సైట్ పని చేయలేదు. ఇప్పుడు కూడా మరోసారి సైట్ డౌన్ అయ్యింది. ఈ నేపథ్యంలో టికెట్లు బుక్ చేసుకోలేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.
రైల్వే వెబ్ సైట్ పని చేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది ఫిర్యాదు చేసినా, రైల్వే స్పందించడం లేదని మండిపడుతున్నారు. “తత్కాల్ టికెట్లు మాత్రమే కాదు, సాధారణ టికెట్లు కూడా బుక్ చేసుకోలేకపోతున్నాం. పండుగ పూట కూడా ఇలా ఇలాంటి ఇబ్బందులు ఏంటి?” అని మండిపడుతున్నారు. “ఫోన్‌పే లో పేమెంట్ విజయవంతమైంది. కానీ, టికెట్ TQWL 35తో వచ్చింది. అసలు IRCTC ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా రైల్వే మీదే పడింది. ప్రతి ఒక్కరు రైల్వేను తిడుతూ పోస్టులు పెడుతున్నారు.
Sir, Kindly raise your concern on https://t.co/Oiw5leQr8C using registered mobile no/mail id along with user id and error screen shot.
— IRCTC (@IRCTCofficial) October 25, 2025
Read Also: ప్రయాణీకుల కోసం వెయిటింగ్ జోన్లు, ఇక ఆ స్టేషన్లలో రద్దీ కనిపించడదట!