BigTV English
Advertisement

Whatsapp : ఇకపై ఎంతమంది గ్రూప్ మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు

Whatsapp : ఇకపై ఎంతమంది గ్రూప్ మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు

Whatsapp : ప్రముఖ మెసేంజిగ్ యాప్ వాట్సప్ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రాన్స్లేషన్, డ్రాఫ్ట్ ఫీచర్స్ ను తీసుకురాగా ఇప్పుడు మరో లేటెస్ట్ ఫీచర్ ను పరిచయం చేసింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్లో ఉన్న యూజర్స్ కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.


వాట్సాప్ లో బిజినెస్, జాబ్, ఫ్యామిలీకి సంబంధించి వాట్సప్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా ఈ గ్రూప్స్ ద్వారానే జరుగుతుంది. దీంతో గ్రూప్ చాట్ చేసే యూజర్స్ కోసం కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది మెటా. ఈ ఫీచర్స్ తో వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది యూజర్స్ లో ఆన్లైన్లో ఉన్నారనే విషయాన్ని చెప్పేస్తుంది. ఆన్లైన్లో ఉన్న వారి సంఖ్యను డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇక గ్రూప్ చాట్ లో టాప్ బార్లో ఈ నెంబర్ కనిపిస్తుంది. వాట్సాప్ గ్రూప్ లో సంభాషణలు మరింత మెరుగుపరిచే దిశగా ఈ కొత్త ఫీచర్ను మెటా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

ఈ బీజీ లైఫ్ లో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ లో ఏదైనా మెసేజ్ చేస్తే అందరూ చూసే స్పందించడానికి తగిన సమయం పడుతుంది. అయితే గ్రూప్లోని సభ్యులు ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారో తెలిస్తే తేలిగ్గా మెసేజ్ చేసి వారి నుంచి రెస్పాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువమంది ఆన్లైన్లో ఉన్నప్పుడు ఏదైనా ముఖ్యమైన సందేశాన్ని షేర్ చేస్తే వేగంగా సమాచారం చేరే అవకాశం ఉంటుందని వాట్సప్ భావిస్తుంది. కేవలం గ్రూప్ చాట్ కోసమే ఈ ఫీచర్ ను తీసుకువచ్చిన వాట్సాప్… గ్రూప్ లో ఉన్న సభ్యుల పేర్లు మాత్రమే కనిపించే విధంగా అప్డేట్ చేసింది. ఈ అప్డేట్ తర్వాత ఆన్లైన్లో ఉన్న వారి సంఖ్య టాప్ లో డిస్ప్లే అవుతుంది.


అయితే ఈ ఫీచర్ కేవలం ఆన్లైన్ స్టేటస్ అవైలబుల్ అని సెట్ చేసుకున్న యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ స్టేటస్ తెలియకుండా సెట్ చేసుకునేవారు గ్రూప్ లో ఆన్లైన్లో ఉన్నప్పటికీ చూపించదు. యూజర్స్ ప్రైవసీకి భంగం కలిగించకూడదని స్టేటస్ డిస్ప్లే చేయమని ఇప్పటికే వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

అయితే ప్రస్తుతానికి బీటా వెర్షన్ లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సప్ వెర్షన్ కలిగి ఉన్న అతి కొద్ది ఫోన్స్ లో ఈ ఫీచర్ ను ఉపయోగించుకునే అవకాశం ఉండనుంది. ఇక రాబోయే రోజుల్లో మిగిలిన వాటిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి ఈ ఫీచర్ పై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్.. పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో మాత్రం చెప్పలేదు.

ఇక ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ఉన్న యూజర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 296 కోట్ల మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. భారతలో అయితే 53 కోట్ల మందికి వాట్సాప్ యాప్ ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తీసుకురావటమే కాకుండా సమాచారాన్ని తేలిగ్గా షేర్ చేయడం, వాట్సాప్ మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్, ఫైల్ షేరింగ్, మనీ ట్రాన్స్ఫర్ వంటి ఫీచర్స్ సైతం అందుబాటులో ఉండటంతో వాట్సాప్ కు ఆదరణ పెరుగుతుంది.

ALSO READ : ఇండియాలో ది బెస్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఇవే!

Related News

OPPO Reno 15 Mini Phone: రూ.33వేల లోపే ఒప్పో రెనో 15 మినీ ఫోన్.. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌కి రేడీ అవ్వండి

Vivo Y31 5G Phone Offers: క్రేజీ డిస్కౌంట్ భయ్యా.. వివో Y31 ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Xiaomi Mini Drone Camera: ఒర్నీ.. ఈ ఫోన్ కెమెరా ఎగురుతుందా? మినీ డ్రోన్ కెమెరాతో షివోమీ మొబైల్ క్రేజీ ఎంట్రీ

Samsung Galaxy A56 5G: మార్కెట్లో దిగిన ఈ ఫోన్ ఫీచర్స్ తెలిస్తే.. ఇతర బ్రాండ్లు షేక్ అవ్వాల్సిందే!

Apple Trade In: పాత ఫోన్లు కొనుగోలు చేస్తున్న ఆపిల్.. మీ ఫోన్ ఎంత విలువ చేస్తుందో తెలుసా?

iPhone 16 Offers: ఇదే మంచి తరుణం.. ఐఫోన్ 16 కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ఉందిగా!

Vivo V30e 5G Mobile: రూ.27 వేలలో ప్రీమియమ్ లుక్‌తో వివో వి30ఈ 5జి. ఈ ఫోన్‌ మీ కోసమే

Resume Free AI Tools: ఉద్యోగం కోసం మంచి రెజ్యూం కావాలా.. ఈ ఫ్రీ ఏఐ టూల్స్‌తో తయారు చేయడం ఈజీ

Big Stories

×